
చికిత్సపొందుతూ మహిళ మృతి
దొరవారిసత్రం : ఆత్మహత్యకు పాల్పడిన ఓ వివాహిత ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందింది. వివరాలు.. డీవీ సత్రం మండలం మినమలముడి గ్రామానికి చెందిన నల్లపాటి సుబ్బమ్మ(50) శనివారం పురుగుల మందు తాగేసింది. స్థానికులు గమనించి తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్సపొందుతూ మరణించింది. సోమవారం ఈ మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో దిక్కుతోచక సుబ్బమ్మ ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు వెల్లడించారు. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. డీవీ సత్రం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పిడుగుపాటుకు
10 మేకలు మృతి
● మేకల కాపరికి స్వల్ప గాయాలు
ఏర్పేడు: మండలంలోని చింతలపాలెం గ్రామానికి చెందిన భీమవరం పెంచలయ్యకు చెందిన 10 మేకలు సోమవారం పిడుగుపాటుకు గురై మృతి చెందాయి. సోమవారం సాయంత్రం పెద్ద ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆ సమయంలో గ్రామ శివారులో మేకలను మేపుకుంటున్న పెంచలయ్యతో పాటు మేకలు చెట్టు కింద చేరాయి. అకస్మాత్తుగా పెద్ద ఉరుములతో కూడిన పిడుగు చెట్టుపై పడింది. దీంతో 10మేకలు పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతిచెందాయి. పెంచలయ్యకు స్వల్పంగా షాక్ తగిలింది. అతనికి ప్రథమ చికిత్స అందించడంతో సురక్షితంగా బయటపడ్డాడు. నిరుపేద రైతు మేకలు పిడుగుపాటుకు మృతి చెందడంతో రూ.1.5లక్షలు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
రేషన్ బియ్యం పట్టివేత
గూడూరు రూరల్ : గాంధీనగర్‌లో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తన ఇంట్లో నిల్వ ఉంచిన 65 రేషన్ బియ్యం బస్తాలను విజిలెన్స్ అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. దాడిలో విజిలెన్స్ ఎస్‌ఐ రామకృష్ణనాయక్, వీఆర్‌ఓ వెంకటరమణ పాల్గొన్నారు.
చైన్ స్నాచింగ్ కేసులో
ఆరుగురికి రిమాండ్
తిరుపతి లీగల్: తిరుమల శ్రీవారి ఆలయంలో బంగారు చైన్‌ను లాక్కెళ్లిన కేసులో ఆరుగురికి 15 రోజులపాటు రిమాండ్ విధిస్తూ తిరుపతి రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి పి కోటేశ్వరరావు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. గత నెల 26వ తేదీ తిరుమలలో తమిళనాడుకు చెందిన ఓ భక్తురాలి మెడలో బంగారు గొలుసు అపహరణకు గురైంది. వన్ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేసి మహారాష్ట్రకు చెందిన అర్జున్ లక్ష్మణ్ మాసాల్కర్, భగవాన్ బాబురావు గైక్వాడ్, వికాస్ విజయ్ జాదవ్, గణేష్ సునీల్ గైక్వాడ్, గైక్వాడ్ ఆకాష్ బాబు, రవి జనార్దన్ జాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.

చికిత్సపొందుతూ మహిళ మృతి