
లారీని ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు
నాయుడుపేటటౌన్: మండల పరిధిలోని విన్నమాల గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున బొగ్గు లోడ్డుతో వెళుతున్న లారీని వెనుక నుంచి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు క్లీనర్ ఏక్ అబ్దుల్ ఖాదర్(40) మృతిచెందాడు. కావలి ప్రాంతానికి చెందిన బస్సు డ్రైవర్ షేక్‌గౌప్ బాషా, మరో డ్రైవర్ కే.సురేష్‌రెడ్డితో పాటు ఇంకో ఎనిమిది మంది ప్రయాణికులు గాయపడ్డారు. పోలీసుల కథనం.. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆదివారం రాత్రి 30 మందికి పైగా ప్రయాణికులతో ఒంగోలు నుంచి బెంగళూరుకు బయలు దేరింది. నాయుడుపేట మండలం, విన్నమాల గ్రామ సమీపంలో జాతీయ రహదారి రోడ్డుపై నిలిపి ఉన్న బొగ్గు లోడ్డు లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు క్లీనర్ షేక్ అబ్దుల్ ఖాదర్ అక్కడికక్కడే మృతిచెందాడు. బస్సు డ్రైవర్ గౌస్‌బాషా కాళ్లు క్యాబిన్‌లో ఇరుక్కుపోయాయి. అతని పక్కనే నిద్రపోతున్న మరో డ్రైవర్ సురేష్‌రెడ్డి(నెల్లూరు) తీవ్రంగా గాయపడ్డాడు. బస్సులో ఉన్న ప్రయాణికులు టీ.లక్ష్మీ(ఒంగోలు), పీ.కుమార్(కందుకూరు), ఏ ప్రవీణ్‌కుమార్(నెల్లూరు), బీ.ఈశ్వర్ (ఒంగోలు), ఽశీలుకుమార్(బిహార్), అఖిల్ (బిహార్), మరో ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. సీఐ బాబి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు దర్యాప్తులో ఉంది. కాగా క్లీనర్ ఏక్ అబ్దుల్ ఖాదర్ భార్యకు మాటలు రావు. ఆమె తన కుమారుడిని వెంటబెట్టుకుని మూగసైగలతో రోదించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది.

లారీని ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు

లారీని ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు

లారీని ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు