
తెగిపోయింది
పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ ద్వారా స్కూలు బ్యాగు ఇచ్చారు. తీసుకున్న వారం రోజులకే బ్యాగు తగిలించుకునే కాడ తెగిపోయింది. దీంతో ప్రత్యామ్నాయంగా మరో బ్యాగును ప్రైవేటు దుకాణంలో కొనుగోలు చేసి రోజువారీ పాఠ్య పుస్తకాలు తీసుకెళుతున్నా.
– వేల్‌మురుగన్, విద్యార్థి
గతంలోని బ్యాగునే వాడుతున్నా
నాకు ఇచ్చిన బ్యాగు పది రోజులకే పూర్తిగా చిరిగిపోయింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రెండేళ్ల క్రితం జగనన్న విద్యాకానుక కింద ఇచ్చిన బ్యాగునే ఇప్పుడు వాడుతున్నా. ఇప్పటికీ ఆ బ్యాగు చక్కగా ఉంది. ఎన్ని పుస్తకాలు తీసుకెళ్లినా చెక్కు చెదరలేదు.
– సుదర్శన్, విద్యార్థి
చిరిగిపోయింది
నేను పాండూరు హైస్కూల్‌లో 7వ తరగతి చదువుతున్నా. ప్రభుత్వం అందించిన స్కూల్ బ్యాగు పది రోజులకే జిప్పు పైభాగంలో చిరిగిపోయింది. ఆ బ్యాగులో పుస్తకాలు తీసుకురావడం ఇబ్బందికరంగా ఉంది. ఎప్పుడు పూర్తిగా చిరిగిపోతుందో అని భయంగా ఉంది.
– చంద్రశేఖర్, విద్యార్థి

తెగిపోయింది

తెగిపోయింది