
యోగాతో ఆరోగ్యకర జీవనం
విజేతలతో నిర్వాహకులు, అతిథులు
తిరుపతి కల్చరల్ : యోగాతోనే ఆరోగ్యకర జీవనం సాధ్యమని డీఎస్పీ బాలిరెడ్డి, స్విమ్స్ కార్డియాలజిస్ట్ వనజ తెలిపారు. యోగాజన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తిరుపతి అధ్వర్యంలో విద్యోదయ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్‌లో సోమవారం జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన బాలిరెడ్డి, వనజ జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. 10 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వారికి ట్రెడిషనల్ యోగాసన, ఆర్టిస్ట్ యోగాజన, రిథమిక్ యోగాజనతో పాటు వేర్వేరుగా 10 విభాగాలలో చేపట్టిన ఈ పోటీలకు సుమారు 130 మంది యోగా సాధకులు హాజరయ్యారు. విజేతలను ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించే రాష్ట్ర యోగా పోటీలకు ఎంపిక చేసినట్లు యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కై లాసింగ్ రాజపురోహిత్ తెలిపారు. అనతరం విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. అసోసియేషన్ ఉపాధ్యక్షులు అమర్‌నాథ్, ఓటేరు కృష్ణ, ప్రధాన కార్యదర్శి ముని మంజుల, సహాయ కార్యదర్శి సుబ్రమణ్యం స్టేట్ అబ్జర్వర్ పెంచలయ్య, డీవైఈఓ బాలాజీ పాల్గొన్నారు.