పూలే సేవలు చిరస్మరణీయం
తిరుపతి అర్బన్: మహిళల విద్యకు మహాత్మా జ్యోతిబాపూలే చేసిన సేవలు చిరస్మరణీయమని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం మహాత్మా జ్యోతిరావుపూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ సీ్త్రలకు విద్య అవసరమన్న విషయం గుర్తించి, ఆ దిశగా ఎనలేని సేవలు చేసిన మహా మనిషి జ్యోతిబాపూలే అని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ రోజు ఘనంగా జ్యోతిరావుపూలే జయంతి కార్యక్రమం అధికారికంగా నిర్వహించామన్నారు. దేశ చరిత్రలో సామాజిక సంస్కరణలకు జ్యోతిబా పూ లే ఆధ్యుడని తెలిపారు. అనంతరం కార్పొరేషన్ రుణాలకు చెందిన చెక్కును జారీ చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ 600 మంది బీసీ, కాపు, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన లబ్ధిదారులకు పలు రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహాయాదవ్, డీఆర్వో నరసింహులు, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజేంద్ర కుమార్ రెడ్డి, బీసీ కార్పొరేషన్ ఈఓ బాబు రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సీఆర్ రాజన్, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సదాశివం, రజక వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డై రెక్టర్లు మదన్‌మోహన్, చంద్రన్న, వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాలాజీకాలనీలోని పూలే విగ్రహానికి పూలమాలలు వేశా రు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాంగాటి గోపాల్‌రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి వెంకట నరసింహులు, నేతలు యార్లపల్లి గోపి, అశోక్ సామ్రాట్ యాదవ్, మజీద్ పట్టేల్, శివశంకర్ పాల్గొన్నారు.
● కలెక్టరేట్‌లో పూలే జయంతి వేడుకలు..


