నలుసైపోయావే..చేప | - | Sakshi
Sakshi News home page

నలుసైపోయావే..చేప

Jan 17 2026 7:24 AM | Updated on Jan 17 2026 7:24 AM

నలుసైపోయావే..చేప

నలుసైపోయావే..చేప

● బాబు గారి పాలనలో మత్స్యసంపదకు గండి

మత్స్యకారులకు చేపల వేటే ప్రధాన వృత్తి. అయితే మత్స్యకారులకు వేట రోజురోజుకూ తగ్గిపోయి, ఉపాధి కోల్పోతున్న నేపథ్యంలో గతంలో ప్రభుత్వాలు నీలి విప్లవం తీసుకువచ్చాయి. నీరున్న అన్ని చెరువుల్లో చేపపిల్లల పెంపకం చేపట్టేవి. అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఈ నీలివిప్లవం తూతూ మంత్రంగా సాగుతుండడంతో చేప నలుసైపోయి.. మత్స్యసంపదకు గండిపడింది. మత్స్యకారులకు ఉపాధి కరువైంది.

తిరుపతి అర్బన్‌: జిల్లాలో మత్యకారుల సొసైటీల పరిధిలో 99 చెరువులు ఉండగా ఇరిగేషన్‌, పంచాయతీ రాజ్‌ పరిధిలో 650కి పైగా చెరువులు ఉన్నాయి. ఏటా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో జిల్లాలో 90 శాతం నీరున్న చెరువులకు చేపపిల్లలను వదిలిపెట్టేవారు. 150 రోజుల్లో ఆ పిల్లలు 600 గ్రాముల నుంచి కిలో వరకు పెద్దవి అయ్యేవి. ఆ తర్వాత సొసైటీ చెరువుల్లో మాత్రం సొసైటీ సభ్యులుగా ఉన్న మత్స్యకారులు వాటిని పట్టుకుని వ్యాపారం చేసుకునేవారు. మిగిలిన చెరువులకు వేలం పాట పాడేవారు. ఆ డబ్బులు చెరువు ఆయకట్టుకు 50 శాతం, గ్రామ పంచాయతీకి 30 శాతం, మత్స్యశాఖకు 20 శాతం చొప్పున పంపిణీ చేసేవారు.

చంద్రబాబు గారి పాలనలో ఇలా..

చంద్రబాబుగారి పాలనలో చూస్తే గత ఏడాది తిరుపతిలోని మత్స్యశాఖ జిల్లా కార్యాలయంలోని తొట్టెలు దెబ్బతిన్నాయని, వాటిని మరమ్మతు చేయాలంటే రూ.70 వేలు ఖర్చు అవుతుందని అధికారులు వెల్లడించారు. మరోవైపు జిల్లా మత్స్యశాఖ కార్యాలయ ప్రాంగణంలోని నీటి తొట్టెల్లో ఏర్పాటు చేసిన విద్యుత్‌ మోటారు చోరీ జరిగింది. దీంతో కొత్త మోటారు ఏర్పాటుకు రూ.30 వేలు ఖర్చు అవుతుందని, మొత్తంగా రూ.లక్ష ఖర్చు చేయాల్సి ఉందని, తమకు నిధులు లేవంటూ గాలికి వదిలేశారు. దీంతో గత ఏడాది చేపపిల్లలు పెంపకం జరగలేదు. దీంతో విజయవాడలో టెండర్లు నిర్వహించి, అక్కడి నుంచే చేపపిల్లలు తెచ్చి, జనవరిలో సొసైటీ పరిధిలోని కొన్ని చెరువుల్లో ఆలస్యంగా వదిలిపెట్టారు. దీంతో పట్టుబడికి కేవలం 70 నుంచి 80 రోజుల సమయం మాత్రం మిగలడంతో మంచి దిగుబడి రాక నష్టపోయారు. ఈ ఏడాది గత ఏడాది లాగే కేవలం సొసైటీ చెరువుల్లో మాత్రమే వదిలిపెడతామని చెబుతున్నారు. జనవరి పూర్తి కావస్తున్నా ఆ ప్రక్రియ మొదలు కాకపోవడంతో ఫిబ్రవరిలో వదిలి, మార్చి నుంచి పట్టుకుంటే ప్రయోజనం శూన్యమని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు పాలనలో మత్స్య సంపదకు గండి పడిందనే చర్చ జోరుగా సాగుతుంది.

గత పాలనలో ఇలా..

గత వైఎస్సార్‌సీపీ పాలనలో జిల్లా కేంద్రమైన తిరుపతిలోని మత్స్యశాఖ జిల్లా కార్యాలయం ప్రాంగణంలోని 13 చేపపిల్లల పెంపకం తొట్టెలు ఏర్పాటు చేశారు. తెనాలి నుంచి సెప్టెంబర్‌, అక్టోబర్‌లో కోటి మేరకు చేపపిల్లలు తెప్పించి, జాలర్ల సమక్షంలో రెండు నెలలు పెంచి, నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో 99 సొసైటీ చెరువులతోపాటు ఇరిగేషన్‌, పంచాయతీ రాజ్‌ పరిధిలోని 90 శాతం నీరున్న 350 చెరువుల్లో చేపపిల్లలు వదిలిపెట్టారు. మరోవైపు ప్రైవేటుగా చేపలను పెంచుకోవాలనుకున్న వారికి నామ మాత్రపు ధరలతో పిల్లలు ఇచ్చారు. దీంతో మత్స్యకారులకు అవసరం మేరకు మత్స్యసంపద అందడంతో వారంతా పెద్ద ఎత్తున వ్యాపారాలు చేసుకున్నారు. మరోవైపు ఫిష్‌ ఆఽంధ్ర పేరుతో మత్స్యకారులకు రూ.50 వేల నుంచి రూ.50 లక్షల వరకు రాయితీలు కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement