కోడి పందేల స్థావరాలపై దాడులు
ఓజిలి: మండలంలోని నె మళ్లపూడి ఎస్సీకాలనీ సమీపంలోని మామిడికాలువ ఒడ్డున కోడి పందేలస్థావరాలపై ఎస్‌ఐ శ్రీకాంత్ గు రువారం దాడులు చేశారు. ఈ దాడుల్లో నలుగురు పందేలరాయుళ్లు, 4 కోళ్లు, రూ.3150 నగదు స్వాధీ నం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసిన్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కోడిపందేలు, పేకాట నిర్వహించి వారిపై చట్టపరమైన చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు.
తొట్టంబేడులో..
తొట్టంబేడు: మండలంలోని తంగేళ్లపాళెంలో కోడిపందేల స్థావరాలపై పోలీసులు దాడి చేసి 13 మంది జూదరులు, 4 కోళ్లు, రూ.1,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. తంగేళ్లపాళెం సమీపంలో కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు రహస్యసమాచారం అందింది. దీంతో టూటౌన్ సీఐ ప్రకాష్‌కుమార్, ఎస్‌ఐ జ్యోతి, పోలీసు సిబ్బంది దాడులు చేశారు. ఈ దాడుల్లో 13 మంది జూదరులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 4 కోళ్లు, రూ.1,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు.
రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
దొరవారిసత్రం: పోలిరెడ్డిపాళెం రైల్వేస్టేషన్‌కు సమీపంలో రైలు పట్టాలపై గుర్తు తెలియని సుమారు 45 ఏళ్లు వయస్సు కలిగిన ఓ వ్యక్తి రైలు నుంచి జారిపడిపోయి శుక్రవారం మృతి చెందాడు. జీఆర్పీ పోలీసుల కథనం మేరకు.. చైన్నె నుంచి బర్మపూర్ వెళ్లే భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ నుంచి గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదశాత్తు జారిపడిపోయి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వివరాలు తెలియలేదు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు జీఆర్పీ హెచ్‌సీ శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్ మృతి
తడ: జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వరదయ్యపాళెం మండలం, సిద్ధమఅగ్రహారం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ చెరివి ముునిచంద్రయ్య(40) మృతి చెందగా హైవేపై పని చేస్తున్న ఇద్దరు సిబ్బంది గాయపడ్డారు. ఎస్‌ఐ కొడపనాయుడు కథనం మేరకు.. ఆటో డ్రైవర్ చెరివి ముునిచంద్రయ్య తన ఆటోలో తడ నుంచి సూళ్లూరుపేటకు బయలుదేరాడు. చేనిగుంట గ్రామానికి సమీపంలోని జాతీయ రహదారిపై ఆటో అదుపు తప్పి రహదారిపై పని చేస్తున్న సిబ్బందిని ఢీకొంది. ప్రమాదం అనంతరం ఆటో డివైడర్‌ని ఢీకొంది. దీంతో ఆటోలో ఉన్న డ్రైవర్‌ముునిచంద్రయ్య డివైడర్‌పై పడ్డాడు. ఈ ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడు. హైవే సిబ్బంది వెంకటరమణయ్య, సురేష్‌కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్‌ఐ సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
కోడి పందేల స్థావరాలపై దాడులు
కోడి పందేల స్థావరాలపై దాడులు
కోడి పందేల స్థావరాలపై దాడులు


