శెట్టిపల్లిలో అందరికీ న్యాయం చేయండి
తిరుపతి అర్బన్: శెట్టిపల్లి భూ సమస్యలో అందరికీ న్యాయం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నా రు. గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు, తుడా చైర్మన్ దివాకర్‌రెడ్డి నేతృత్వంలో లాటరీ పద్ధతిలో ప్లాట్ల కేటాయింపు నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను కలెక్టరేట్‌కు పిలిపించారు. త్వరలో ఆ ప్రాంతా న్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే కలెక్టర్ 636 ఎకరాల పరిధిలోని శెట్టిపల్లికి సంబంధించి 2,111 మందికి పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు.
406 మంది పేర్లు ఎందుకు వెల్లడించలేదు
శెట్టిపల్లిలో 2,111 మందికి పట్టాలు పంపిణీ చేయ డానికి జాబితాను విడుదల చేసినట్లు అధికారులు చెబుతున్నారని, సీపీఎం జిల్లా కార్యదర్శి నాగరాజు శుక్రవారం తెలిపారు. అయితే అందులో 1,705 మంది పేర్లు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు. మిగిలిన 406 మంది పేర్లు ఎందుకు వెల్లడించలేదని అధికారులను నాగరాజు ప్రశ్నించారు. అనేక పోరాటాలు చేసిన తర్వాత ఇస్తున్నారని చెప్పారు.


