సైద్ధాంతిక నిబద్ధతకు తార్కాణం ఏవీ వర్మ
తిరుపతి కల్చరల్: కష్టాలు, కన్నీళ్లు, నిర్భంధాలు అధిగమించి ఎర్రజెండా పురోభివృద్ధికి చివరివరకు నిలబడిన వ్యక్తి క్రామేడ్ ఏవీ వర్మ అని, ఆయన సైద్ధాంతిక నిబద్ధతకు తార్కాణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు మూలం రమేష్ తెలిపారు. సీపీఎం సీనియర్ నేత ఏవీ.వర్మ పార్థివదేహాన్ని ఎ స్వీ మెడికల్ కళాశాలకు గురువారం సీపీఎం శ్రేణు లు అందించారు.ఈ సందర్భంగా జరిగిన అంతిమ యాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కంరణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వి.రాంభూపాల్ మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమ తరగతుల్లో తన మనవరాలితోపాటు పది రోజులు అధ్యయనం చేయడానికి వర్మ పాల్గొన్న తీరు తనను అబ్బుర పరిచిందన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు వందవాసి నాగరాజు రా మానాయుడు, పి.మురళి, పెంచలయ్య, ఆర్.హరికృష్ణ, కందారపు మురళి, జయచంద్ర, టి.సుబ్రమణ్యం ప్రసంగించి నివాళులర్పించారు.


