క్యాటరింగ్ దుకాణంలో అగ్ని ప్రమాదం
నాయుడుపేటటౌన్: పట్టణంలోని సీఎస్ తేజ సెంటర్ సమీపంలో ఉన్న ఓ క్యాటరింగ్ దుకాణంలో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. క్యాటరింగ్ దుకాణ నిర్వహకులు శుక్రవారం ఉదయం దుకాణంలో దేవుని పటాల వద్ద దీపం వెలగించి ఆలయాలనికి వెళ్లారు. వెలుగుతున్న దీపం కింద ఉన్న పేపరుకు నిప్పు అంటుకుని మంటలు చెలరేగాయి. దుకాణంలో మంటలు వస్తుండడంతో స్థానికులు గుర్తించి అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందజేశారు. దుకాణ నిర్వహకులు వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు.
అదుపు తప్పి ఆటో బోల్తా
నాయుడుపేటటౌన్: పట్టణంలోని తుమ్మూరు సమీపంలో శుక్రవారం ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఆటోడ్రైవర్‌తోపాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కథ నం మేరకు.. పట్టణంలోని కాలవగట్టు ప్రాంతానికి చెందిన చెంచమ్మ అమె బంధువు, పిల్లలతో కలిసి నాయుడుపేట పట్టణం నుంచి సగటూరుకు ఆటోలో బయలు దేరారు. ఆటో తుమ్మూరుకు వచ్చేసరికి రహదారిపై ఒక్కసారిగా ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ఆటో నడుపుతున్న చంద్రబాబు కాలనీకి చెందిన డ్రైవర్ అబ్దుల్ అతని పక్కనే కూర్చుని ఉన్న అదే ప్రాంతానికి చెందిన డ్రైవర్ స్నేహితుడు వెంకటేష్‌తోపాటు చెంచమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ముగ్గురిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డ్రైవర్ అబ్దుల్లాతోపాటు అతని స్నేహితుడు వెంకటేష్ మద్యం మత్తులో ఉండడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
యాత్రికురాలికి బ్యాగు
అప్పగించిన పోలీసులు
రేణిగుంట: చైన్నెకు చెందిన వినోద్ కుటుంబసభ్యులు గురువారం రేణిగుంట రైల్వేస్టేషన్‌లో బంగారం ఉన్న బ్యాగ్‌ను మర్చిపోయి వదిలి వెళ్లిపోయారు. గుర్తుతెలియని బ్యాగ్ ఉందని ప్రయాణికులు రేణిగుంట అర్బన్ పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా బ్యాగులో బంగారం, వస్తువులు ఉండడాన్ని గమనించి విచారించి బ్యాగ్ యజమానిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి బ్యాగును అప్పగించారు.
ఆశ్రమ పీఠాధిపతి కన్నుమూత
నారాయణవనం: మండలంలోని ప ర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రమైన కైలా సనాథ కోనలోని శాంతి ఆశ్రమ పీఠాధిపతి కైలాసనంద గిరి స్వామి శుక్రవా రం మధ్యాహ్నం శివైక్యం పొందినట్లు నిర్వాహకులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ఆశ్రమంలో సమాధి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సేవల టికెట్ కౌంటర్ ప్రారంభం
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో టికెట్ కౌంటర్లు, శ్రీకాళహస్తీశ్వరాలయ ప్రచార రథాన్ని శుక్రవారం ఎమ్మెల్యే బొజ్జల సుదీర్ రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం అన్ని సేవల టికెట్లు ఒకే ప్రాంగణంలో లభించేలా రంగుల గోపురం సమీపంలో కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే శ్రీకాళహస్తీశ్వర క్షేత్ర ప్రభావాన్ని తెలిపేలా ప్రచారరథాన్ని ప్రారంభించామన్నారు. చైర్మన్ కొట్టే సాయి. ఈఓ బాపిరెడ్డి పాల్గొన్నారు.
బంగారు గొలుసు చోరీ
తిరుపతి రూరల్: మండలంలోని శ్రీనివాసపురంలో గుర్తు తెలియని వ్యక్తులు మోటర్ బైక్‌లో వచ్చి నడచి వెళుతున్న ఓ మహిళ మెడలో చైను లాక్కెళ్లిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు.. తిరుపతి రూరల్ మండలం శ్రీనివాసపురంలో కాపురముంటున్న లెక్కల గజేంద్ర నాయుడు భార్య శశిరేఖ మిల్క్‌పార్లర్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 11.40 గంటలకు దుకాణం నుంచి తన కుమార్తె చరితతో కలసి ఇంటికి నడచి వెళుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరు మోటర్ బైక్‌లో వచ్చి ఆమె వెనుక నుంచి మెడలోని చైన్ లాక్కొని పరారయ్యారు. తన మెడలోని బంగారం గొలుసు 36 గ్రాములు ఉంటుందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తిరుపతి రూరల్ ఎస్‌ఐ జ్యోతి తెలిపారు.
క్యాటరింగ్ దుకాణంలో అగ్ని ప్రమాదం
క్యాటరింగ్ దుకాణంలో అగ్ని ప్రమాదం


