తిరుమలలో ఘనంగా శ్రీవారి పార్వేట ఉత్సవం
తిరుచ్చిపై ఊరేగుతున్న
కృష్ణస్వామి
తిరుమల : వేంకటేశ్వరస్వామివారికి పార్వేట ఉత్సవం ఘనంగా జరిగింది. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు కై ంకర్యాలు పూర్తి అయిన తరువాత మలయప్పస్వామి వారు, కృష్ణస్వామి తిరుచ్చిలపై పార్వేట మండపానికి చేరుకున్నారు. అనంతరం అక్కడ అర్చకులు స్వామివారికి పుణ్యాహవచనం, ఆరాధాన, నివే దన, హారతి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఉభయదారులైన తాళ్లపాక వారికి, మరం వారికి మర్యాదలు జరిగాయి. కృష్ణస్వామివారికి సన్నిధి యాదవ పూజ చేసిన చోటుకు వేంచేపు చేసి పాలు, వెన్న, హారతులు సమర్పించారు. తరువాత మలయప్పస్వామివారు పార్వేట నిర్వహించారు. అంతకముందు అదనపు ఈఓ వెంకయ్యచౌదరి శ్రీసన్నిధి గొల్లభాగ్య చరితం పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాథం, ముఖ్య అర్చకులు కిరణ్ దీక్షితులు, పేష్కార్ రామకృష్ణ, పారుపత్తేదారు బాలసుబ్రమణ్యం పాల్గొన్నారు.
తిరుమలలో ఘనంగా శ్రీవారి పార్వేట ఉత్సవం


