అణగారిన వర్గాల ఆశాజ్యోతి పూలే
తిరుపతి సిటీ: అణగారిన వార్గాల ఆశాజ్యోతి, సీ్త్ర విద్య కోసం ఎనలేని కృషి చేసిన మహనీయులు మహాత్మా జ్యోతిబా పూలే అని వైఎస్సార్ సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి కొనియాడారు. శుక్రవారం తిరుపతి వైఎస్సార్ సీపీ క్యాంపు కార్యాలయంలో పూలే జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. కుల వివక్ష నిర్మూలన, సమసమాజ స్థాపన కోసం అవిశ్రాంత పోరాటం చేసిన సాంఘిక సంస్కర్త పూలే అన్నారు. నేటి యువత ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయ కర్త అభినయ్‌రెడ్డి, నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు, బీసీ నాయకులు లవ్‌లీ వెంకటేష్, మోహన్, అరుణ్, మురళి, బొగ్గుల వెంకటేష్, కరాటే శీను, గోపాల్‌రెడ్డి, రమణ, సాయికుమారి, పునీత, పుష్పలత, కార్పొరేటర్లు, వైఎస్సార్ సీపీ పలు విభాగాల నాయకులు పాల్గొన్నారు.


