పారిశ్రామికవేత్తలుగా రాణించాలి
తిరుపతి సిటీ: నూతన ఆవిష్కరణలపై యువత దృష్టి సారించి పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని జేఎన్టీయూ వీసీ సుదర్శన్‌రావు పిలుపునిచ్చారు. స్థానక కరకంబాడి రోడ్డులోని శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాలలో తరంగ్–2025 పేరుతో గురువారం జరిగిన వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రామన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్‌లోనూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలోనూ పట్టు సాధించాలన్నారు. కళాశాల చైర్మన్ మన్నెం రామిరెడ్డి మాట్లాడుతూ సమాజానికి ఉపయుక్తమైన ఆవిష్కరణలపై విద్యార్థులు దృష్టి సారిస్తే చిరస్థాయి గుర్తింపుతోపాటు పది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే స్థాయికి చేరుకుంటారన్నారు. వార్షికోత్సవం సందర్భంగా అకడమిక్ విద్యలోనూ, క్రీడల్లోనూ ప్రతిభ చూపిన విద్యార్థులకు అతిథులు జ్ఞాపికలు, ధ్రువపత్రాలను అందజేశారు. అనంతరం విద్యార్థుల ఫ్లాష్ మాబ్, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రాయలసీమ విద్యాసంస్థల డైరెక్టర్ మన్నెం వెంకటరామిరెడ్డి, కళాశాల సెక్రటరీ మన్నెం రామసుబ్బారెడ్డి, డైరెక్టర్ మన్నెం అరవింద్‌కుమార్ రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ జయచంద్ర, కన్వీనర్ మునిశంకర్ పాల్గొన్నారు.
పారిశ్రామికవేత్తలుగా రాణించాలి


