భక్త జనహోరు
కోదండరాముడి తేరు..
శుక్రవారం శ్రీ 4 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
తిరుపతి కల్చరల్: కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన గురువారం ఉదయం రథోత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామి వారు రథంపై మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారి రథాన్ని లాగారు. రథం యథాస్థానానికి చేరిన తర్వాత ప్రబంధం, వేద శాత్తుమొర నిర్వహించి, హారతి సమర్పించారు. మధ్యాహ్నం తిరుమంజనం, ఆస్థానం, సాయంత్రం స్వామివారికి ఊంజల్ సేవ నిర్వహించారు. రాత్రి స్వామివారి అశ్వవాహన సేవ వేడుకగా సాగింది. ఈ కార్యక్రమంలో పెద్ద జీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈఓలు గోవిందరాజన్, నాగరత్న, ఏఈఓ రవి, సూపరింటెండెంట్ మునిశంకర్, పుల్ ఇన్‌స్పెక్టర్ సురేష్ పాల్గొన్నారు.
న్యూస్‌రీల్
వైభవంగా రథోత్సవం
రాత్రి అశ్వంపై స్వామి విహారం
నేడు చక్రస్నానం
శ్రీకోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు కపిలతీర్థంలో చక్రస్నానం వైభవంగా జరుగనుంది.
భక్త జనహోరు


