16లోగా విభజన ప్రక్రియ పూర్తి.. | Zonal system transfer for employees soon says CS Somesh Kumar | Sakshi
Sakshi News home page

16లోగా విభజన ప్రక్రియ పూర్తి..

Dec 14 2021 3:29 AM | Updated on Dec 14 2021 3:38 AM

Zonal system transfer for employees soon says CS Somesh Kumar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగుల విభజనకు సంబంధించిన ప్రక్రియను ప్రభుత్వం మరింత వేగవంతం చేసింది. ఈ మేరకు షెడ్యూల్‌తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సోమవారం రాత్రి రెండు జీవోలను జారీ చేశారు. ఇప్పటికే పూర్తయిన సీనియారిటీ జాబితాపై అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

ఈ నెల 16వ తేదీలోగా జిల్లా, జోనల్, మల్టీ జోనల్‌ విభజన పూర్తి చేయాలని, 20వ తేదీలోగా సంబంధిత అధికారులు కేటాయింపు ఆదేశాలు జారీ చేయాలని ఆదేశించారు. ఇది పూర్తయిన వారం రోజుల్లో ఉద్యోగులు కేటాయించిన విధుల్లో చేరాలని స్పష్టం చేశారు. ఈ దిశగా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియ కోసం జిల్లా అధికారుల నేతృత్వంలో కమి టీలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి జోనల్‌ పరిధిలో రిపోర్టింగ్‌ అథారిటీ ఏర్పాటుకు సంబంధించిన మార్గదర్శకాలు జీవోల్లో వివరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement