‘కోర్టు మొట్టే వరకు కేసీఆర్‌ బుర్ర పనిచేయలేదు’ | YSRTP YS Sharmila Slams CM KCR Over Governor Case | Sakshi
Sakshi News home page

‘కోర్టు మొట్టే వరకు కేసీఆర్‌ బుర్ర పనిచేయలేదు’

Jan 31 2023 3:07 AM | Updated on Jan 31 2023 3:07 AM

YSRTP YS Sharmila Slams CM KCR Over Governor Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గవర్నర్‌ విషయంలో కోర్టు మొట్టికాయలు వేస్తే తప్ప కేసీఆర్‌కు బుర్ర పనిచేయలేదని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల ఎద్దేవా చేశా రు. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేయాలని ప్రయత్నిస్తూ.. కోర్టుల్లో అడ్డంగా దొరికిపోయారని ఆమె పేర్కొన్నారు.

గతంలో రెండుసార్లు గవర్నర్‌ ప్రసంగం లేకుండానే బడ్జెట్‌ ప్రవేశపెట్టిన కేసీఆర్‌.. ఈసారి భంగపాటు కు గురయ్యారని వ్యాఖ్యానించారు. బడ్జెట్‌ ఆమోదానికి గవర్నర్‌ను ఆదేశించాలని కోర్టుకెళ్లే ఆయన.. నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో మాట్లాడే ధైర్యం లేదా? అని ప్రశ్నించారు. 80వేల పుస్తకాలు చదివానని గొప్పలు చెప్పుకోవడం కాదు.. ముందు అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని చదవాలని షర్మిల హితవు పలికారు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement