తెలంగాణ: రాజ్‌భవన్‌కు వైఎస్‌ షర్మిల.. పోలీసుల తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు!

ysrtp chief ys sharmila Goes To Raj BhavanTo Met Gov Tamilisai - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్‌ఆర్‌టీపీ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల.. రేపు(గురువారం) రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు. గవర్నర్‌ తమిళిసై తమిళిసై సౌందరరాజన్‌ను ఆమె భేటీ కానున్నారు. ఈ మేరకు అపాయింట్‌మెంట్‌ ఖరారు అయినట్లు సమాచారం. 

ఈ సందర్భంగా పోలీసుల తీరుపై వైఎస్‌ షర్మిల.. గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. అక్రమంగా తనను అదుపులోకి తీసుకున్నారని, ఆ టైంలో వ్యవహరించిన తీరును ఆమె గవర్నర్‌కు వివరించే అవకాశం ఉంది.  ఇదిలా ఉంటే.. వైఎస్‌ఆర్‌టీపీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల అరెస్టుపై సౌందరరాజన్‌ ఆందోళన వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్‌ చేశారు.  ఆమె కారులో ఉండగానే.. లాక్కుంటూ వెళ్లిన దృశ్యాలు కలవరపెట్టాయని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top