‘వైఎస్సార్‌లా తెలంగాణ కూడా స్వచ్ఛమైనది’ | YS Vijayamma Speech At YS Sharmils Padayatra Pillon Inauguration | Sakshi
Sakshi News home page

బంగారు తెలంగాణ కోసమే షర్మిల అడుగులు.. కొత్తకోట పైలాన్‌ ఆవిష్కరణలో వైఎస్‌ విజయమ్మ

Sep 10 2022 6:27 PM | Updated on Sep 10 2022 6:37 PM

YS Vijayamma Speech At YS Sharmils Padayatra Pillon Inauguration - Sakshi

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల ప్రజాప్రస్థానం 2వేల కిలోమీటర్ల మైలురాయి దాటింది.

సాక్షి, వనపర్తి: మహానేత వైఎస్సార్‌ కుటుంబాన్ని ప్రేమించే ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలని పేర్కొన్నారు వైఎస్‌ విజయమ్మ. తెలంగాణలో వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల చేపట్టిన పాదయాత్ర 2వేల కిలోమీటర్ల మైలురాయి పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం జిల్లాలోని కొత్తకోట బస్టాండ్‌ వద్ద పైలాన్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వైఎస్‌ విజయమ్మ పాల్గొని ప్రసంగించారు. 

‘‘వైఎస్సార్‌ కుటుంబాన్ని ప్రేమించే ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతం వైఎస్సార్‌. వైఎస్సార్‌లా తెలంగాణ కూడా స్వచ్ఛమైంది. మీ ప్రేమ, ఆప్యాయతలతోనే షర్మిల 2వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేయగలిగింది. నడిచింది షర్మిలే అయినా.. నడిపించింది మీరే అంటూ అక్కడి కార్యక్రమానికి హాజరైన ప్రజలను, వైఎస్సార్‌టీపీ నేతలు.. కార్యకర్తలను ఉద్దేశించి వైఎస్‌ విజయమ్మ ధన్యవాదాలు తెలియజేశారు. 

బంగారు తెలంగాణ కోసమే షర్మిల అడుగులు వేస్తోందని, అందుకు తెలంగాణ ప్రజానీకం ఆశీర్వాదం కావాలని ఆకాక్షించారు వైఎస్‌ విజయమ్మ. ఇదిలా ఉంటే.. 148 రోజుల్లో 2వేల కిలోమీటర్ల ప్రజాప్రస్థానం పూర్తి చేసుకున్నారు వైఎస్‌ షర్మిల. వనపర్తి జిల్లాలో షర్మిల పాదయాత్ర మైలురాయి దాటగా.. కొత్తకోట వద్ద పైలాన్‌ ఆవిష్కరించారు.

ఇదీ చదవండి: తెలంగాణలో వెస్ట్‌ బెంగాల్‌ వ్యూహమా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement