
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తాను తల పెట్టిన ‘ప్రజా ప్రస్థా నం’ పాదయాత్రకు కలసిరావాల్సిందిగా కోరుతూ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆహ్వాన పత్రికలను మంగళవారం విడుదల చేశారు. ఈ నెల11న పునఃప్రారం భించనున్న పాదయాత్రను స్థానిక సమస్యలు, అవస రాలు, ఆలోచనలు తెలుసుకోవడానికే నిర్వహి స్తున్నట్టు తెలిపారు. ఇప్పుడు రాష్ట్రంలో లేని సమస్య అంటూ లేదని, కేసీఆర్ పాలనలో ప్రజాసంక్షేమమే లేదన్నారు. సమస్యల పరి ష్కారం కోసం వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ఆద ర్శంగా తీసుకుని ఆయన బాటలోనే తాను ఈ పాదయాత్రను చేస్తున్నట్టు స్పష్టం చేశారు.