భార్య వివాహేతర సంబంధం.. మనస్తాపంతో భర్త ఆత్మహత్య | Young Man Commits Suicide wife incident | Sakshi
Sakshi News home page

భార్య వివాహేతర సంబంధం.. మనస్తాపంతో భర్త ఆత్మహత్య

Jun 9 2026 3:27 PM | Updated on Jun 9 2026 3:36 PM

Young Man Commits Suicide wife incident

కరీంనగర్ జిల్లా ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య మరోవ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్‌లో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బండి రాజు(35)కొమురంభీమ్‌ జిల్లా ఆసిఫాబాద్‌ ప్రాంతానికి చెందిన ఓ మహిను ప్రేమించి 8 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. 

వీరికి ఇద్దరు ఆడపిల్లలు జన్మనించారు. అదేగ్రామానికి చెందిన మండల రవీందర్‌తో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇది సరైన పద్ధతి కాదని రాజు తన భార్యతోపాటు రవీందర్‌నూ పలుమార్లు మందలించినా తీరు మారలేదు. ఈక్రమంలో ఆర్నెల్లక్రితం తన ఇద్దరు పిల్లలను తీసుకుని తన స్వస్థలం వెళ్లిపోయింది. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టించినా, మందలించినా రవీందర్‌ తీరు మారకపోగా.. తన భార్యను తరచూ కలుసుకోవడంతో అవమానంగా భావించి మనస్తాపంతో రాజు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

 ఆగ్రహించిన మృతుడి కుటుంబ సభ్యులు ఇందుకు కారణమని భావించి రవీందర్‌ ఇందిఎదుట మృతదేహతో ధర్నా చేశారు. ఆత్మహత్యకు కారణమైన మృతుడి భార్యతోపాటు రవీంరద్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమాచారం అందుకున్న మంథని సీఐ రాజు, ముత్తారం, రామగిరి ఎస్సైలు రవికుమార్, శ్రీనివాస్‌ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోలీస్‌స్టేషన్‌ వద్దకు తరలించారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement