కూకట్‌పల్లి: క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం.. కోట్ల డబ్బు..

XCSPL Company Huge Fraud In The Name Of Crypto Currency - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: క్రిప్టో కరెన్సీ పేరుతో నగరంలో కూకట్‌పల్లిలో కేటుగాళ్లు రెచ్చిపోయారు. XCSPL కంపెనీ క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసానికి పాల్పడింది. దీంతో బాధితులు కంపెనీ ఎదుట ధర్నాకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.

వివరాల ప్రకారం.. కూకట్‌పల్లిలోకని XCSPL కంపెనీ క్రిప్టో కరెన్సీ పేరుతో కోట్ల రూపాయలు దండుకుంది. రూ. లక్షకు నాలుగు లక్షలు రూపాయలు ఇస్తామని బాధితులకు ఆశ చూపించి వారిని మోసం చేసింది. ఏకంగా 90 రోజుల్లోనే వారు పెట్టిన పెట్టుబడికి నాలుగు రేట్లు ఎక్కువగా ఇస్తామని డబ్బులు వసూలు చేసింది. దీంతో, బాధితులు.. అప్పుచేసి, లోన్‌ తీసుకుని, క్రెడిట్‌ కార్డు ద్వారా డబ్బులు ఇన్వెస్ట్‌ చేశారు. 

తీరా.. కంపెనీ వారికి డబ్బు చెల్లించకపోవడంతో అసలు మోసం బయట పడింది. దీంతో, బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అనంతరం, మంజీరా మాల్‌లోని ఆఫీసు ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. ఇక, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top