డాబాపై నుంచి తోసేసి.. యాసిడ్ బాడీలోకి ఎక్కించి | Wife murders husband in Nizamabad | Sakshi
Sakshi News home page

డాబాపై నుంచి తోసేసి.. యాసిడ్ బాడీలోకి ఎక్కించి

Jul 6 2026 6:10 PM | Updated on Jul 6 2026 7:27 PM

 Wife murders husband in Nizamabad

సాక్షి, నిజామాబాద్‌: మోపాల్‌ మండలం న్యాలకల్‌లో దారుణం జరిగింది. తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని  కట్టుకున్న భర్తను అత్యంత దారుణంగా  భార్య హతమార్చింది. గత నెల 30న భర్త ప్రశాంత్‌ను ఎలాగైనా అంతమెుందించాలని డాబాపై నుంచి భార్య సంధ్య తోసేసింది. దీంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో వారి బంధువులు వెంటనే ఆసుపత్రిలో చేర్చించారు.

అయితే తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్న భర్తను ఎలాగైనా కడతేర్చాలని భావించిన భార్య మరో పన్నాగం పన్నింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో టాయిలెట్‌ క్లీనర్‌ను తన శరీరంలోకి ఎక్కించింది. దీంతో అతని పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు.  ప్రస్తుతం  పోలీసులు ప్రశాంత్ భార్య సంధ్యతో అతని ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement