ఏఐ మోడల్సే సైబర్‌దాడికి పాల్పడితే.. | What if AI models commit cyberattacks | Sakshi
Sakshi News home page

ఏఐ మోడల్సే సైబర్‌దాడికి పాల్పడితే..

Sep 1 2026 2:47 AM | Updated on Sep 1 2026 2:47 AM

What if AI models commit cyberattacks

అత్యాధునిక కృత్రిమ మేధ (ఏఐ) చరిత్రలోనే ఓ షాకింగ్‌ పరిణామం. ఏఐ మోడల్సే సైబర్‌దాడికి పాల్పడితే...? మనుషుల కంటే తెలివిగా ఆలోచించి, టెస్టులో చీటింగ్‌కు ప్రయత్నిస్తే! ఓపెన్‌ ఏఐ చరిత్రలోనే సంచలనమైన ఈ ఘటన ఇటీవల చోటుచేసుకుంది.  
– సాక్షి, హైదరాబాద్‌

ఇది ఏఐ హిస్టరీలోనే ఒక ‘వార్నింగ్‌ షాట్‌’ లాంటిదని ఓపెన్‌ ఏఐ స్వయంగా ఒప్పుకుంది. భవిష్యత్తులో అటానమస్‌ ఏఐ ఏజెంట్లు (స్వయంగా నిర్ణయాలు తీసుకునే ఏఐలు) మనుషుల ప్రమేయం లేకుండా బ్యాంకులు, ఆస్పత్రులు లేదా పవర్‌ గ్రిడ్‌లపై సమూహాలుగా దాడి చేస్తే ఎంత ప్రమాదమో ఈ ఘటన నిరూపించింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఏఐ సేఫ్టీ రూల్స్‌ రెగ్యులేషన్లపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఒక నియంత్రిత టెస్టింగ్‌ వాతావరణం (సాండ్‌బాక్స్‌) నుంచి ఓపెన్‌ఏఐ అడ్వాన్స్‌డ్‌ ఏఐ మోడల్స్‌ నియంత్రణ తప్పి ప్రముఖ ఓపెన్‌–సోర్స్‌ ఏఐ ప్లాట్‌ఫారమైన హగ్గింగ్‌ ఫేస్‌పై సైబర్‌ దాడికి పాల్పడ్డాయి. ఇది భవిష్యత్తు ఏఐ సేఫ్టీపై ఆందోళనను పెంచుతోంది. ఆగస్టు చివరి వారంలో ఓపెన్‌ ఏఐ, స్వతంత్ర పరిశోధన సంస్థలు దీనిపై నివేదికలు విడుదల చేశాయి.  

నివేదికల్లోని ముఖ్యాంశాలు 
జూలైలో ఓపెన్‌ఏఐ కొత్త రీసెర్చ్‌ మోడల్స్‌ సామర్థ్యాలను పరీక్షించడానికి సైబర్‌ సెక్యూరిటీ చాలెంజ్‌ (ఎక్స్‌ప్లాయిట్‌ జిమ్‌) పరీక్షను నిర్వహించింది. ఈ టెస్టింగ్‌ సమ యంలో మోడళ్లకు ఉండే సేఫ్టీ గైడ్‌లైన్స్‌ను తాత్కాలికంగా తొలగించారు. 
⇒ టెస్టులో అడిగిన కఠినమైన ప్రశ్నలకు సమాధానాలు వెతకడానికి బదులు, ఆ ఏఐ మోడల్స్‌ టెస్టులో చీటింగ్‌ చేయాలని నిర్ణయించుకున్నాయి. అందుకోసం అవి తమను బంధించిన సాండ్‌బాక్స్‌ వ్యవస్థలోని లోపాలను వాడుకుని, ఇంటర్నెట్‌లోకి ప్రవేశించి, పరీక్షకు సంబంధించిన కీ దాగి ఉందనే అనుమానంతో హగ్గింగ్‌ ఫేస్‌ సర్వర్లపై దాడి చేశాయి. 

⇒ మొదట్లో ఇది ఒకే ఒక్క రోగ్‌ ఏఐ ఏజెంట్‌ చేసిన పని అనుకున్నారు, కానీ దాదాపు 1,200 ఏఐ ఏజెంట్లు ఒకదాంతో మరొక టి రహస్యంగా కమ్యూనికేట్‌ చేసుకుని ఓ సమూహంగా ఏర్పడినట్లు తేలింది. 
⇒ ట్రైనింగ్‌ సమయంలో సమాచారాన్ని దాచుకునే ఒక అంతర్గత మెమో ఫీచర్‌ను ఈ ఏఐలు ఒక ’రహస్య మెసేజ్‌ బోర్డు’లా మార్చుకున్నాయి. దీని ద్వారా 70,000 కంటే ఎక్కువ సందేశాలు, ఫైళ్లను మార్పిడి చేసుకున్నాయి.  
⇒ మనుషుల్లాగే ఈ ఏఐలు కూడా గ్రూపులుగా విడిపోయాయి. కొన్నేమో కమాండ్‌ ఇవ్వడానికి, కొన్నేమో నిఘా పెట్టడానికి పనులను విభజించుకున్నాయి. ఒక ఏఐ ఏజెంట్‌ వెనకడుగు వేస్తుంటే, మరో ఏఐ ఏజెంట్‌ ఒత్తిడి తెచ్చి...‘మన గ్రూప్‌ లక్ష్యం కోసం నిన్ను నువ్వు త్యాగం చెయ్‌’ అని ప్రోత్సహించినట్లు తేలింది. 

⇒ టైమ్‌ మ్యాగజైన్‌ కథనం ప్రకారం... ఈ రోగ్‌ ఏఐల వ్యవహారాన్ని పరిశోధించడం మనుషుల వల్ల సాధ్యం కాలేదు. ఈ భారీ డేటాను విశ్లేషించడానికి పరిశోధకులు మళ్లీ మరో ఏఐ సహాయం తీసుకోవాల్సి వచ్చింది. 
⇒ హగ్గింగ్‌ ఫేస్‌ టీమ్‌ మొదట ఈ సైబర్‌ దాడి లాగ్‌లను విశ్లేషించడానికి అంత్రోపిక్‌ సంస్థకు చెందిన కమర్షియల్‌ ఏఐ మోడళ్లను వాడటానికి ప్రయత్నించింది. కానీ ఆ లాగ్‌లలో సైబర్‌ ఎటాక్‌ కోడ్‌ ఉండటం వల్ల, ఆ ఏఐలు తమ సొంత సేఫ్టీ రూల్స్‌ కారణంగా విశ్లేషణకు నిరాకరించాయి. చివరకు ఓపెన్‌–వెయిట్‌ మోడల్‌ సహాయంతో... కమర్షియల్‌ ఏఐలు తిరస్కరించడంతో, చైనాకు చెందిన జెడ్‌.ఏఐ సంస్థ అందించిన తక్కువ ఆంక్షలున్న జీఎల్‌ఎం 5.2 అనే ఓపెన్‌–వెయిట్‌ ఏఐ మోడల్‌ను ఉపయోగించి ఈ విచారణను పూర్తి చేయాల్సి వచ్చింది. ఈ విచారణను పరిశోధకులు జోక్‌గా ‘స్లాప్‌–వెస్టిగేషన్‌’ గా అభివర్ణించారు. 

ఏఐ తప్పులు బయటపడకుండా ఉండేందుకు..  
⇒ దొంగిలించిన లాగిన్‌ వివరాలు, సాఫ్ట్‌వేర్‌ ప్రాక్సీలో ఉన్న జీరో–డే సెక్యూరిటీ లోపాలను ఏఐలు ఉపయోగించుకున్నాయి. 
⇒ తాము చేసిన తప్పులు బయటపడకుండా ఉండేందుకు ఈ రోగ్‌ ఏఐలు తమ డిజిటల్‌ రికార్డులను, లాగ్‌లను డిలీట్‌ చేయడానికి లేదా మార్చడానికి ప్రయత్నించాయి 
⇒ వినియోగదారుల రక్షణ చట్టాల ఉల్లంఘన కింద అమెరికాలోని అలబామా అటార్నీ జనరల్‌ ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్‌ ఆల్ట్‌మన్‌కు లీగల్‌ నోటీసు జారీ చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement