వైద్య రంగంలో సంచలనం.. 2 సెకన్లలోనే గుండె జబ్బుల గుర్తింపు | Superhuman AI tool spots heart disease in less than 2 seconds | Sakshi
Sakshi News home page

వైద్య రంగంలో సంచలనం.. 2 సెకన్లలోనే గుండె జబ్బుల గుర్తింపు

Sep 1 2026 1:26 AM | Updated on Sep 1 2026 1:26 AM

Superhuman AI tool spots heart disease in less than 2 seconds

source: X

వైద్య రంగంలో సంచలనం చోటు చేసుకుంది. కేవలం రెండు సెకన్లలోనే గుండె జబ్బులను గుర్తించే 'సూపర్‌హ్యూమన్' ఏఐ టూల్‌ను వైద్యులు అభివృద్ధి చేశారు. ఈ టూల్‌ సాధారణంగా చేసే ఎలక్ట్రోకార్డియోగ్రామ్ (ECG) పరీక్షను విశ్లేషించి.. రెండు సెకన్లలోపే గుండె వైఫల్యం (Heart Failure), గుండె కవాటాల వ్యాధి (Heart Valve Disease) ముప్పును గుర్తించగలదు.

ECGలో కంటికి కనిపించని సూక్ష్మ సంకేతాలను ఈ సాంకేతికత గుర్తించగలదని పరిశోధకులు చెబుతున్నారు. లక్షలాది మంది రోగుల నుంచి సేకరించిన ECG డేటాతో ఈ AI మోడల్‌కు శిక్షణ ఇచ్చారు. ఈ పరిశోధన వివరాలను మ్యూనిక్‌లో జరిగిన European Society of Cardiology వార్షిక సమావేశంలో వేలాది మంది వైద్య నిపుణుల సమక్షంలో వెల్లడించారు.

బీపీ, టైప్-2 డయాబెటిస్‌ను కూడా గుర్తించే ప్రయత్నం
మ్యూనిక్‌లో జరిగిన అదే వైద్య సదస్సులో మరో ఆసక్తికరమైన పరిశోధన వివరాలు కూడా వెల్లడయ్యాయి. జపాన్‌లోని University of Tokyo, Institute of Science Tokyo పరిశోధకులు కేవలం ఐదు సెకన్ల ముఖ వీడియోను AI విశ్లేషించడం ద్వారా అధిక రక్తపోటు (Hypertension), టైప్-2 డయాబెటిస్‌ను గుర్తించే విధానంపై పరిశోధన చేశారు.

ప్రపంచవ్యాప్తంగా అధిక రక్తపోటు, టైప్-2 డయాబెటిస్ ఉన్నప్పటికీ తమకు ఆ సమస్యలు ఉన్నాయని తెలియని లక్షలాది మంది ఉన్న నేపథ్యంలో.. ఇలాంటి AI ఆధారిత టెక్నాలజీలు ముందస్తు గుర్తింపులో కీలకంగా మారే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు.

చదవండి: ఏఐల సీక్రెట్‌ నెట్‌వర్క్‌! ఒకదానితో ఒకటి మాట్లాడుకుని..

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement