Viral Video: Warangal Police Eat Coconut, Egg, And Lemon Used For Black Magic - Sakshi
Sakshi News home page

Viral Video: క్షుద్రపూజలో వాడిన కోడిగుడ్లు, నిమ్మకాయ తిన్న పోలీస్.. హిజ్రాతో పాటు ముగ్గురిని..

Published Tue, Mar 15 2022 12:47 PM

Warangal Traffic Police eat Egg And Lemon used In Black Magic - Sakshi

సాక్షి, వరంగల్‌: ఓపక్క టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతున్నా.. మరోవైపు మూఢ నమ్మకలకు ముగింపు పలకలేకపోతున్నాం. నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో చేతబడులు, క్షుద్ర పూజల పేరుతో ప్రాణాలను తీస్తున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లా కాకతీయ కాలనీ లో క్షుద్రపూజలు కలకలం రేపాయి.  దీంతో భయాందోళనతో  కాలనీ వాసులు పోలీసులకు సమాచారమిచ్చారు.  సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షుద్రపూజలను భగ్నం చేసి హిజ్రాతో పాటు ముగ్గురి అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు వరంగల్‌ పోలీస్‌ అధికారులు ప్రజలకు  అవగాహాన కల్పించేందుకు వినూత్న కార్యక్రమం నిర్వహించారు. వరంగల్ బట్టల బజార్ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఆది, బుధవారాల్లో కొందరు వ్యక్తులు క్షుద్రపూజలు చేస్తున్నారు. రోడ్డుపై కోడిగుడ్లు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు ఉండటంతో వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
చదవండి: హైకోర్టు ఉత్తర్వు కాపీలతో అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు.. స్పీకర్‌ ఏమన్నారంటే..

దీంతో విషయం తెలుసుకున్న వరంగల్ పోలీసులు.. బ్రిడ్జిపై పూజలు చేసి వదిలేసిన కొబ్బరికాయలు, కోడిగుడ్లు, నిమ్మ కాయలు, పూజ సామగ్రిని ఒక్కచోటకు చేర్చారు. ప్రజలు చూస్తుండగానే నారాయణ అనే హోం గార్డ్ కోడి గుడ్డును గుటుక్కున మింగేశాడు. కొబ్బరికాయ పగలగొట్టి ఆ కొబ్బరి నీళ్లని తాగాడు.  అంతేకాదు పూజలు చేసిన ఆ నిమ్మకాయలను కోసి నిమ్మరసం తాగేశాడు. ఈ కార్యక్రమం ద్వారా పోలీసులు మూఢ నమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
చదవండి: ఇటుక అండగా.. ఇల్లు చల్లన! కూల్‌ బ్రిక్స్‌ తయారీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement