ఆల్‌నైన్‌ వేలం అదుర్స్‌.. 9999 నెంబర్‌కు అన్ని లక్షలా..? 

Vehicle Registration Number 9999 Fetches Rs 4.49 lakh in Khairtabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీఏ ఫ్యాన్సీ నెంబర్‌లపై వాహనదారులు తమ క్రేజ్‌ను చాటుకున్నారు. ఖైరతాబాద్‌ ఆర్టీఏలో శుక్రవారం ప్రత్యేక నెంబర్లకు నిర్వహించిన ఆన్‌లైన్‌ వేలంకు వాహనదారుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. అన్ని ప్రత్యేక నెంబర్‌లపైన ఆర్టీఏకు రూ.35,58,778 లభించినట్లు జేటీసీ పాండురంగనాయక్‌ తెలిపారు. టీఎస్‌ 09 ఎఫ్‌.వి 9999 నెంబర్‌ కోసం జి.రాజశేఖర్‌రెడ్డి అనే వాహనదారుడు ఆన్‌లైన్‌ వేలం పోటీలో రూ.4,49,999 చెల్లించి సొంతం చేసుకున్నారు. ‘టీఎస్‌ 09 ఎఫ్‌ డబ్ల్యూ 0001’ అనే మరో నెంబర్‌ కోసం శ్రీనిధి ఎస్టేట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ వేలంలో పోటీపడి రూ.4 లక్షలు చెల్లించింది. ‘టీఎస్‌ 09 ఎఫ్‌డబ్ల్యూ 0099’ నెంబర్‌ కోసం వై.బిందురెడ్డి  ఆన్‌లైన్‌ వేలంలో రూ.3,72,000 చెల్లించి సొంతం చేసుకున్నారు.    
చదవండి: (Hyderabad: గుడ్‌న్యూస్‌.. సిటీబస్సు @ 24/7)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top