స్థలం కేటాయిస్తే సైన్స్‌ సిటీ ఏర్పాటు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

Union Minister Kishan Reddy Statement On Science City In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  హైదరాబాద్‌ నగరంలో 25 ఎకరాల స్థలం కేటాయిస్తే సైన్సు సిటీ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వెల్లడించారు. బేగంపేటలోని హరిత ప్లాజాలో శనివారం జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ సమితి (దిశ) సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో ట్రైబల్‌ మ్యూజియం ఏర్పాటు చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నగరంలో జరుగుతున్న వివిధ పథకాలను సమీక్షించారు. ఇళ్ల నిర్మాణ వివరాలను జీßæచ్‌ఎంసీ అధికారులను అడిగి తెలుసుకొన్నారు. త్వరగా పూర్తి చేయాలని సూచించారు. జేఎన్‌యూహెచ్‌ స్కీమ్‌లో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. త్వరగా అందజేయాలని ఆదేశించారు.

కేంద్ర ప్రభుత్వం కేటాయించిన వెల్‌నెస్‌ సెంటర్ల గురించి ప్రశ్నించగా.. 152 బస్తీ దవాఖానాలు, యుహెచ్‌సీలను వెల్‌నెస్‌ సెంటర్లుగా మార్చినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. నగరంలోని టీబీ పేషంట్లను తాను దత్తత తీసుకుంటానని మంత్రి తెలిపారు. పీఎం స్వయంనిధి, ముద్ర రుణాలు అందరికీ అందేట్లు చూడా లని బ్యాంకు అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్, హెచ్‌ఎండబ్ల్యూ ఎండీ దానకిషోర్, హైదరాబాద్‌ కలెక్టర్‌ అమోయ్‌ కుమార్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి, సంయుక్త సంచాలకులు ఎన్‌.సురేందర్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: నిలబడి.. కలబడేదెలా?.. భవిష్యత్తు కార్యాచరణపై టీపీసీసీ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top