కేంద్ర బడ్జెట్‌ 2023-24: హైదరాబాద్‌ను కరుణించేనా?

Union Budget 2023-24: Will FM Concern Hyderabad Pending Projects - Sakshi

కోరింది రూ.4వేల కోట్లు.. వచ్చేదెన్ని కోట్లో? 
బడ్జెట్‌లో బల్దియాకు కేటాయింపులు ఎన్నో?   
ఇటీవల కేంద్రానికి లేఖ రాసిన మంత్రి కేటీఆర్‌  

జీహెచ్‌ఎంసీ పనులకు కోరిన నిధుల వివరాలు  
ఎస్‌ఎన్‌డీపీకి గతంలో అడిగినప్పటికీ రూ. 240 కోట్లు ఇవ్వలేదని, కనీసం ఈసారైనా వాటిని ఈ బడ్జెట్‌లో కేటాయించాలి. హైదరాబాద్‌ నగరంలో పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగు పరిచేందుకు  స్వచ్ఛ భారత్‌ మిషన్‌ నిధులు రూ. 400 కోట్లు కేటాయించాలి.   

ఎస్సార్‌డీపీ రెండో దశకుకు మొత్తం రూ.14000 కోట్లు ఖర్చు కానుండగా, అందులో పదిశాతం  రూ.1400 కోట్లు కావాలి. ఎలివేటెడ్‌ కారిడార్లు, స్కైవేలకు ఖర్చు కానున్న రూ.9000 కోట్లలో పదిశాతం రూ.900 కోట్లు.  
 
నగరంలో చేపట్టిన లింక్‌రోడ్లతో ఎన్నో ప్రయోజనాలు కలిగాలియి. ఇంకా ఎన్నో లింక్‌రోడ్ల ప్రతిపాదనలున్నాయి. కొత్తగా 104 లింక్‌ రోడ్లకు రూ.2400 కోట్లు వ్యయం కానుండగా అందులో మూడోవంతు నిధులు రూ.800 కోట్లు ఇవ్వాలి. మూడోవిడత 
బాండ్లకు రావాల్సిన ప్రోత్సాహకాలు, ఇతరత్రా వెరసీ దాదాపు రూ. 4వేల కోట్ల వరకు ఇవ్వాల్సి ఉంది.  

►పిట్‌లైన్లు లేక రైళ్ల రాకపోకల్లో జాప్యం 
►లింగంపల్లిలో ఉంటే మరిన్ని రైళ్లకు హాలి్టంగ్‌ 
►సికింద్రాబాద్‌పై పెరిగిన భారీ ఒత్తిడి 
►చర్లపల్లి టెర్మినల్ విస్తరణకు ఇంకొంత కాలం 

బడ్జెట్‌పై ఆశలు.. 
ప్రతి బడ్జెట్‌ ఒక ప్రహసనంగానే మారుతోంది. పాత  ప్రాజెక్టులకు కొద్దిపాటి నిధులు కేటాయించడం మినహా ఎలాంటి అభివృద్ధి కనిపించడం లేదు. దీంతో ఒక్కో ప్రాజెక్టు ఏళ్లకేళ్లుగా నత్తనడకన సాగుతోంది. చర్లపల్లి టర్మినల్‌ విస్తరణే అందుకు నిదర్శనం. నాలుగేళ్లుగా పనులు కొనసాగుతున్నా ఇప్పటికీ కొలిక్కి రాకపోవడం గమనార్హం.   
  

సారీ.. నో హాల్టింగ్‌
సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి ప్రతి రోజు సుమారు 200 రైళ్లు వివిధ ప్రాంతాలకు బయలుదేరుతాయి. రైళ్ల నిర్వహణ, ప్రాథమిక మరమ్మతులు తదితర పనుల కోసం  పిట్‌లైన్లపై కొంతకాలంగా ఒత్తిడి పెరిగింది. దీంతో  స్టేషన్‌కు చేరుకున్న రైళ్లను మరికొంత దూరం అంటే వికారాబాద్‌ వరకు తీసుకెళ్లి అక్కడ నిర్వహణ అనంతరం తిరిగి సికింద్రాబాద్‌కు తీసుకొస్తున్నారు. 

దీంతో రైళ్ల రాకపోకల్లో జాప్యం నెలకొంటోంది. దీన్ని నివారించేందుకు సికింద్రాబాద్‌కు దగ్గరలో ఉన్న లింగంపల్లి స్టేషన్‌లో పిట్‌లైన్ల ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన చాలా కాలంగా ఉంది. దీనివల్ల సికింద్రాబాద్‌పైన ఒత్తిడి తగ్గడమే కాకుండా  లింగంపల్లి నుంచి  రైళ్లు నేరుగా బయలుదేరేందుకు అవకాశం ఉంటుంది. కానీ పిట్‌లైన్ల ప్రతిపాదన అమలుకు నోచుకోకపోవడంతో  ప్రస్తుతం లింగంపల్లి నుంచి కేవలం 5 రైళ్లు బయలుదేరుతున్నాయి.  పిట్‌లైన్లు ఉంటే మరిన్ని రైళ్లు అక్కడి నుంచి నడిచే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా ఈ దిశగా చర్యలు చేపట్టాల్సి ఉంది. 

రెండు లైన్లు ఉన్నా చాలు.. 
ప్రస్తుతం లింగంపల్లి స్టేషన్‌ నుంచి గౌతమి, కోకనాడ, నర్సాపూర్, విజయవాడ ఇంటర్‌సిటీ, నారాయణాద్రి రైళ్లు మాత్రమే నేరుగా బయలుదేరుతున్నాయి. మిగతా రైళ్లన్నీ సికింద్రాబాద్‌ నుంచే నడుస్తున్నాయి. లింగంపల్లిలో 4 ప్లాట్‌ఫాంలు అందుబాటులో ఉన్నాయి. ఎంఎంటీఎస్‌ రైళ్లకు రెండు లైన్లు మినహాయిస్తే మరో రెండింటిలో దూరప్రాంతాల రైళ్లకు హాలి్టంగ్‌ కలి్పస్తున్నారు. పడమర వైపు నగరం అనూహ్యంగా విస్తరించడంతో లింగంపల్లి, బీహెచ్‌ఈఎల్, పటాన్‌చెరు, హైటెక్‌ సిటీ తదితర ప్రాంతాలకు చెందిన  ప్ర యాణికులు లింగంపల్లి నుంచి నేరుగా బయలుదేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో గౌత మి, కోకనాడ వంటి రైళ్లకు డిమాండ్‌ నెలకొంది.
  
నర్సాపూర్, ఇంటర్‌సిటీ రైళ్లకు సైతం లింగంపల్లి చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ప్రయాణికుల నుంచిఅనూహ్యమైన ఆదరణ ఉంది. ప్రయాణికుల డిమాండ్‌ మేరకు మరిన్ని రైళ్లను నడిపేందుకు అవకాశం ఉన్నప్పటికీ  రైళ్ల నిర్వహణకు పిట్‌లైన్లు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. కనీసం 2 పిట్‌లైన్లను ఏర్పాటు చేసినా మరి కొన్ని రైళ్లను ఇక్కడి నుంచి నడిపేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ముంబై వైపు వెళ్లే రైళ్లను లింగంపల్లి నుంచి నడపవచ్చని రైల్వే అధికారి ఒకరు తెలిపారు.   

కొనసాగుతున్న చర్లపల్లి టెర్మినల్ పనులు.. 
గ్రేటర్‌లోని మూడు ప్రధాన రైల్వేస్టేషన్లు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడలపై రైళ్ల ఒత్తిడి పెరిగింది. దీంతో నాలుగో టర్మినల్‌గా చర్లపల్లి స్టేషన్‌ విస్తరణ చేపట్టారు. నాలుగేళ్ల క్రితమే పనులు ప్రారంభించినప్పటికీ స్థలం కొరత కారణంగా జాప్యం నెలకొంది. చివరకు దక్షిణమధ్య రైల్వేకు అందుబాటులో ఉన్న స్థలంలోనే టరి్మనల్‌ విస్తరణ చేపట్టారు. ఈ టరి్మనల్‌ అందుబాటులోకి వస్తే  మొదటి దశలో కనీసం 10 రైళ్లను ఇక్కడి నుంచి నడిపేందుకు అవకాశం ఉంటుంది. దశలవారీగా 50 రైళ్లను  చర్లపల్లి నుంచి నడిపేందుకు ప్రణాళికలను రూపొందించారు. ఈ ఏడాది  జూన్‌ నాటికి టరి్మనల్‌ను వినియోగంలోకి తేవాలని భావిస్తున్నారు. కానీ మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. లింగంపల్లిలో పిట్‌లైన్లను ఏర్పాటు చేస్తే తూర్పు వైపున చర్లపల్లి తరహాలో పడమటి వైపున లింగంపల్లిలో హాల్టింగ్‌ సదుపాయాలు పెరుగుతాయి.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top