బోధనాస్పత్రుల అధ్యాపకులకు యూజీసీ వేతనాలు 

UGC Salaries For Doctors In Teaching Hospitals In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ వైద్య విద్య బోధనాస్పత్రుల్లోని అధ్యాపకులకు యూజీసీ వేతనాలను అమలుచేస్తూ సర్కారు బుధవారం జీఓ జారీ చేసింది. వైద్య కళాశాలల్లోనూ అర్హులైన అధ్యాపకులందరికీ, విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లోని అధ్యాపకులతో సమానంగా ఈ పీఆర్సీ వర్తిస్తుందని తెలిపింది. పెంచిన వేతన సవరణ 1 జనవరి 2016 నుంచి వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఈ ఉత్తర్వు లతో రాష్ట్రంలో 9 ప్రభుత్వ బోధనాస్పత్రుల్లోని 230 ట్యూటర్లు, 1561 అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, 614 అసో సియేట్‌ ప్రొఫెసర్లు, 461 ప్రొఫెసర్స్‌ లబ్ధి పొందనున్నారు. కాగా పీఆర్సీ ఎరియర్స్‌ వస్తాయనుకుంటే తమకు భంగపాటు ఎదురైందని తెలంగాణ ప్రభు త్వ వైద్యుల సంఘం ఒక ప్రకటనలో అసంతృప్తి వ్య క్తం చేసింది. త్వరలోనే ఎరియర్స్‌ జీఓతో పాటు ఏడో వేతన సవరణకు అనుగుణంగా రవాణా భత్యం మంజూరు చేయాలని సంఘం కోరింది. కాగా అధ్యాపకులందరికీ ఎరియర్స్‌ కింద రూ.525 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని గుర్తుచేసింది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top