పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలి  | TSPE JAC Applied To TS Govt Over Old Pension System For Electricity Employees | Sakshi
Sakshi News home page

పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలి 

Jul 8 2022 1:59 AM | Updated on Jul 8 2022 3:16 PM

TSPE JAC Applied To TS Govt Over Old Pension System For Electricity Employees - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ విద్యుత్‌ సంస్థల్లో 1999 నుంచి 2004 మధ్య కాలంలో చేరిన ఉద్యోగులకు పాతపెన్షన్, జీపీఎఫ్‌లను అమలు చేయాలని టీఎస్‌పీఈ జేఏసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం ఆ సంఘం ప్రతినిధులు టీఎస్‌పీఈఏ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ ఐదేళ్ల కాలంలో 4700 మంది సంస్థలో ఉద్యోగులుగా చేరారని, వీరందరికీ పాత పెన్షన్‌ విధానాన్ని వర్తింపజేసి ఆదుకోవాలని కోరారు.

శుక్రవారం ఇదే అంశం ప్రధాన డిమాండ్‌గా చలో హైదరాబాద్‌ సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమావేశం అనంతరం తెలంగాణ విద్యుత్‌ సంస్థల చైర్మన్‌ ప్రభాకర్‌రావు నేతృత్వంలో ప్రతినిధి బృందం సీఎం కేసీఆర్‌ను కలిసి మరోసారి విజ్ఞప్తి చేయనున్నట్లు జేఏసీ ప్రతినిధులు రత్నాకర్‌రావు, సదానందం, సాయిబాబా, కుమారస్వామి, వెంకటనారాయణ, తదితరులు ఉన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement