టెన్త్‌ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలి

TS: Minister Sabitha Indra Reddy Comments On Tenth Class Students - Sakshi

విద్యాశాఖ మంత్రి సబిత

సాక్షి, హైదరాబాద్‌: పదవ తరగతి విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేందుకు వీలుగా కృషి చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యా శాఖాధికారులను ఆదేశించారు. కరోనా వల్ల జరి గిన నష్టాన్ని పూడ్చుకునేందుకు, పరీక్షల్లో ఉత్తీర్ణత శాతాన్ని మెరుగుపర్చేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. గురువారం ఆమె డీఈవోలు, వివిధ శాఖల ఇంజనీర్లతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ప్రత్యేక తరగతులు నిర్వహించా లని సూచించారు. సిలబస్‌ను 70 శాతానికి పరి మితం చేయడం, పరీక్షా సమయాన్ని పెంచడం, చాయిస్‌ పెంచడం, ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఎక్కువ ఇవ్వడం వంటి మార్పులపై విద్యార్థులకు అవగా హన కల్పించాలని కోరారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు–మనబడి, ఇంగ్లిష్‌ మీడి యం విద్య రాబోయే కాలంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తుందని ఆమె అన్నారు. స్కూళ్ల నిర్మాణం, మరమ్మతుల విషయంలో నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె ఇంజనీర్లకు సూచిం చారు. సమావేశంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ దేవసేన, రాష్ట్ర విద్య, మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్‌ ఎండి పార్థసారథి పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top