TS ICET Results 2022: టీఎస్ ఐసెట్‌ ఫ‌లితాలు విడుద‌ల‌.. రిజ‌ల్ట్స్ కోసం క్లిక్ చేయండి

TS ICET Result Declared, Here Is How To Check Results - Sakshi

సాక్షి , హైదరాబాద్‌: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన టీఎస్ ఐసెట్–2022 ఫలితలు నేడు (ఆగస్టు 27) విడుదలయ్యాయి. ఈ ఫ‌లితాల‌ను కాకతీయ యూనివర్సిటీలో మ‌ధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ లింబాద్రి విడుద‌ల చేశారు. ఈ ఫ‌లితాల‌తో పాటు ఫైనల్ కీ ని కూడా విడుదల చేశారు. ఈ టీఎస్ ఐసెట్ 2022 ఫ‌లితాల‌ను సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ ( www.sakshieducation.com )లో చూడొచ్చు.

ఐసెట్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గుంటూరు జిల్లాకు  చెందిన దంతాల పూజిత్ వర్థన్ మొదటి ర్యాంకు కైవసం చేసకోగా..  వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన  అంబవరం ఉమేష్ చంద్రారెడ్డి రెండవ ర్యాంకు సాధించారు. అలాగే గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన కాట్రగడ్డ జితిన్ సాయికి మూడో ర్యాంకు వచ్చింది. తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా  కేసముద్రానికి చెందిన వెలిశాల కార్తీక్ నాలుగో ర్యాంక్‌ సాధించారు.

కాగా ఐసెట్ ప్రవేశ పరీక్షను జులై 27, 28 తేదీల్లో నాలుగు సెషన్లలో నిర్వహించారు. తెలంగాణతో పాటు ఏపీలో కూడా పలు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. టీఎస్ ఐసెట్‌-2022కు 75,952 మంది దరఖాస్తు చేసుకోగా.. 68,781 విద్యార్థులు పరీక్ష రశారు. వారిలో  61,613 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అర్హత సాధించిన అభ్యర్థుల్లో 30,409 మంది పురుషులు (89 శాతం), 31,201 మంది మహిళలు (89.34 శాతం) 3 ట్రాన్స్‌జెండర్లు (75 శాతం) ఉన్నారు. ఫలితాలు https://icet.tsche.ac.in అందుబాటులో ఉన్నాయి.

టీఎస్ ఐసెట్-2022 ఫ‌లితాలు కోసం క్లిక్ చేయండి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top