కేసుల సత్వర విచారణ జరపాలి: హిమా కోహ్లి

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి సూచన
మూడు అదనపు జూనియర్ సివిల్ కోర్టులు ప్రారంభించిన చీఫ్ జస్టిస్
నాగర్‌కర్నూల్/ కొల్లాపూర్: బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు సమన్వయంతో పనిచేసి కేసులను సత్వరమే విచారణ జరిపి ప్రజలకు న్యాయం చేకూర్చాలని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి సూచించారు. సోమవారం హైదరాబాద్ నుంచి వర్చువల్ సమావేశం ద్వారా నాగర్‌కర్నూల్‌లో 2వ అదనపు జూనియర్ సివిల్ కోర్టు, కొల్లాపూర్‌లో మొదటి, రెండో జూనియర్ సివిల్ కోర్టులను ప్రారంభించారు. సమావేశంలో హైకోర్టు న్యాయమూర్తి అభిషేక్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జి ప్రేమావతి, 4వ అదనపు సెషన్స్ జడ్జి రవికుమార్, సీనియర్ సివిల్ జడ్జి శీతల్, మొబైల్ మెజిస్ట్రేట్ మురళీమోహన్, జూనియర్ సివిల్ జడ్జి స్వరూప, ఎస్పీ సాయిశేఖర్, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నార