10 వేల ఎకరాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లు 

TS Govt Set Up Food Processing Zones In 10k Acres - Sakshi

అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం  

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ ఉత్పత్తులకు మరింత విలువను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో దాదాపు 10 వేల ఎకరాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్ర జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 20 శాతంగా ఉంది. 2013–14లో రూ.1.12 లక్షలుగా ఉన్న తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం ప్రస్తుతం రూ.2.28 లక్షలకు పెరిగింది. విదేశాల నుంచి దిగుమతి అవుతున్న పండ్లు, పూలు, కూరగాయలకు రాష్ట్రంలో భారీగా డిమాండ్‌ పెరిగింది.

ఆ డిమాండ్‌కు అనుగుణంగా పండ్లు, కూరగాయలు, పూల ఉత్పత్తి వైపు మన రైతులను మళ్లించేందుకు ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌’పేరుతో ప్రభుత్వం రెండు ప్రదర్శనశాలలను ఏర్పాటు చేసింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం ములుగులోని తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం ఆవరణలో 53 ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పండ్ల సాగు కేంద్రాన్ని నెలకొల్పింది. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా జీడిమెట్లలో కూరగాయలు, పూల సాగుపై సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ కేంద్రాన్ని ఉద్యానవన యూనివర్సిటీ ఏర్పాటు చేసింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top