జూన్‌ 27 నుంచి ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ | Sakshi
Sakshi News home page

జూన్‌ 27 నుంచి ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌

Published Sat, May 25 2024 3:39 AM

TS EAMCET 2024 Engineering First phase counselling starts from June 27

అదే రోజు నుంచి ఫార్మసీ కౌన్సెలింగ్‌ కూడా.. 

తొలి దశ సీట్ల కేటాయింపు జూలై 12న  

జూన్‌ 8 నుంచి ఈ సెట్‌ కౌన్సెలింగ్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి వచ్చే నెల 27వ తేదీ నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలుకానుంది. ఇందుకు సంబంధించిన తేదీలను ఉన్నత విద్య మండలి శుక్రవారం విడుదల చేసింది. ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకూ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ (టీఎస్‌ఈఏపీ సెట్‌) ఉమ్మడి ప్రవేశ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. ఈ సెట్‌ ఫలితాలను ఈ నెల 18న విడుదల చేశారు.

సెట్‌లో అర్హత సాధించిన వారికి కాలేజీల్లో కన్వీనర్‌ కోటా పరిధిలో ఉండే సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. కౌన్సెలింగ్‌ తేదీ లపై ఉన్నత విద్య మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం పలువురు ఉన్నతాధికారులు సమావేశయ్యా రు. అనంతరం షెడ్యూల్‌ను విడుదల చేశారు. 

12 నుంచి స్లైడింగ్‌... 
ఒకే కాలేజీలో వివిధ బ్రాంచ్‌లు మారాలనుకునే వారు ఆగస్టు 12, 13 తేదీల్లో స్లైడింగ్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఆప్షన్లను 13వ తేదీ ఫ్రీజ్‌ చేస్తారు. 16 న సీట్ల కేటాయింపు ఉంటుంది. 17వ తేదీలోగా విద్యార్థులు స్లైడింగ్‌లో కేటాయించిన బ్రాంచ్‌కు అంగీకరిస్తున్నట్టు రిపోర్టు చేయాలి.  

జూన్‌ 8 నుంచి ఈ–సెట్‌ కౌన్సెలింగ్‌ 
డిప్లొమా కోర్సులు చేసిన విద్యార్థులు ఇంజనీరింగ్‌ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఈ–సెట్‌లో ఉత్తీర్ణులైన వారికి జూన్‌ 8 నుంచి కౌన్సెలింగ్‌ చేపడుతున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ఉన్నత విద్యా మండలి శుక్రవారం విడుదల చేసింది.

కౌన్సెలింగ్‌ తేదీలు ఇలా...

Advertisement
 
Advertisement
 
Advertisement