నాగోబా మహాపూజ; చెట్టెక్కిన మెస్రం అల్లుడు

Tribal Festival Nagoba Jatara Started in Keslapur Village - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: ఆదివాసీల ఆరాధ్య దైవం కేస్లాపూర్‌ నాగోబా మహాపూజ సందడి మొదలైంది. మహాపూజ కోసం మెస్రం వంశీయులు కాలినడకన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం గోదావరి హస్తినమడుగు నుంచి పవిత్ర గంగాజలం సేకరించి తిరిగి వచ్చారు. ముందుగా ఇంద్రవెల్లిలోని ఇంద్రాదేవి ఆలయానికి చేరుకుని పవిత్ర జలాన్ని కిందపెట్టకుండా మర్రి చెట్టుపై ఉంచి పూజలు చేశారు. అనంతరం నాగోబా ఆలయానికి పవిత్ర జలాన్ని ఆదివారం సాయంత్రం తీసుకెళ్లాల్సి ఉండటంతో, వారి సంప్రదాయం ప్రకారం మెస్రం వంశీయుల అల్లుడు మర్రి చెట్టు ఎక్కి పవిత్ర జలాన్ని కటోడా (పూజారి)కి అందజేశారు. 

11న మహాపూజ
మర్రిచెట్టు వద్ద బస చేసిన మెస్రం వంశీయులు మూడు రోజుల పాటు సంప్రదాయ పూజలు చేసి ఈనెల 11న పుష్యమాసం అమావాస్యనుపురస్కరించుకుని గోదావరి నది హస్తీన మడుగు నుంచి తీసుకొచ్చిన పవిత్రమైన గంగా జలంతో  నాగోబా ఆలయాన్ని శుద్దిచేసి మహాపూజలతో నాగోబా జాతరను ప్రారంభించనున్నట్టు మెస్రం వంశం పెద్దలు తెలిపారు.  

చదవండి:
ఆ ఊరంతా ప్రభుత్వ ఉద్యోగులే.. ఎందుకంటే!

ఉల్లి: ఒక్క ఎకరాలోనూ పంట వేయని రైతులు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top