వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే నెపంతో.. | Tragedy In Medak Caused By An Extramarital Affair | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే నెపంతో..

Jun 8 2026 7:18 AM | Updated on Jun 8 2026 7:18 AM

Tragedy In Medak Caused By An Extramarital Affair

సైనికుడిని కొట్టి చంపిన భార్య, అత్తామామలు

మెదక్‌: మరో మహిళతో వివాహేత ర సంబంధం పెట్టుకు న్నాడనే నెపంతో కట్టు కున్న భార్య, ఆమె తల్లి దండ్రులు, తమ్ముడితో కలిసి భర్తను దారుణంగా కొట్టి చంపారు. ఈ ఘటన ఆదివారం మెదక్‌ జిల్లా మెదక్‌ మండలంలో వెలుగులోకి వచ్చింది.

ర్యాలమడుగు గ్రామానికి చెందిన పుంటికూర కుమార్‌గౌడ్‌ (50) ఆర్మీలో జవాన్‌గా విధులు నిర్వహిస్తు న్నారు. అతనికి కొల్చారం మండలం వరిగుంతం గ్రామానికి చెందిన పద్మతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారిద్దరి మధ్య గొడవ కారణంగా కొన్ని నెలలుగా విడిగా ఉంటున్నారు. కుమార్‌గౌడ్‌ పట్టణంలోని మిలిటరీ కాలనీలో ఉంటున్నారు.

మరో మహిళతో అతడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే నెపంతో శనివారం రాత్రి అతడి భార్య పద్మ, ఆమె తల్లిదండ్రులు రామకృష్ణగౌడ్‌–ఎల్లమ్మ, సోదరుడు సంతోష్‌తో పాటు మరికొందరు కుమార్‌గౌడ్‌పై విచక్షణారహితంగా ఇనుప రాడ్స్, కర్రలతో కొట్టి చంపారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పద్మతో పాటు ఆమె తల్లిదండ్రులు, తమ్ముడిని పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement