హైదరాబాద్‌: పంద్రాగస్టు వేడుకలు.. ట్రాఫిక్‌ ఆంక్షలు ఇలా | Traffic Restrictions For Independence day Celebrations At Golconda Fort, | Sakshi
Sakshi News home page

Traffic Restrictions:పంద్రాగస్టు వేడుకలు.. ట్రాఫిక్‌ ఆంక్షలు ఇలా

Aug 14 2021 8:37 AM | Updated on Aug 14 2021 9:46 AM

Traffic Restrictions For Independence day Celebrations At Golconda Fort,  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గోల్కొండ కోటలో ఆదివారం పంద్రాగస్టు వేడుకలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంపై పోలీసు విభాగం డేగకన్ను వేసింది. గోల్కొండ కోటలో ప్రతి అణువూ రికార్డు అయ్యేలా చర్యలు తీసుకుంది. మొత్తమ్మీద 120 అదనపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన నగర పోలీసులు వీటినీ బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనరేట్‌లోని కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో (సీసీసీ) అనుసంధానించింది. స్థానిక పోలీసుస్టేషన్, కోట వద్ద ఉన్న కంట్రోల్‌ రూమ్‌లోనూ దృశ్యాలను చూసేలా ఏర్పాటు చేశారు. 

ఈ తాత్కాలిక సీసీ కెమెరాల పని తీరుపై సీసీసీ అధికారులు శుక్రవారం ట్రయల్‌ రన్‌ నిర్వహించి సంతృప్తి వ్యక్తం చేశారు. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో నగర వ్యాప్తంగా నిఘా, గస్తీ ముమ్మరం చేశారు. గోల్కొండ కోటలోకి ప్రవేశించే ప్రతి ద్వారం దగ్గరా డోర్‌ఫ్రేమ్, మెటల్‌ డిటెక్టర్లను ఏర్పాటు చేసి తనిఖీ చేయనున్నారు. 

ట్రాఫిక్‌ ఆంక్షలు ఇలా 
► 15న ఉ. 7 నుంచి మ. 12 గంటల వరకు కో ట వైపునకు వాహనాలకు అనుమతి లేదు. 
► రాందేవ్‌గూడ నుంచి కోటకు ఎ, బి, సి, పాస్‌ హోల్డర్స్‌ వాహనాలకే అనుమతి.
► కింద్రాబాద్, బంజారాహిల్స్, మాసబ్‌ట్యాంక్, మెహిదీపట్నం నుంచి వచ్చే పాస్‌ హోల్డర్లు రేతిబౌలి,నానల్‌నగర్‌ జంక్షన్‌ నుంచి లంగర్‌హౌస్‌ ఫ్లైఓవర్, టిప్పు ఖాన్‌ బ్రిడ్జి, రాందేవ్‌గూడ జంక్షన్‌ మీదుగా రావాలి. ► మక్కై దర్వాజ వద్ద ఎ– కారు పాస్‌ హోల్డర్లు మెయిన్‌ రోడ్డు పక్కన, బి– పాస్‌ హోల్డర్లు గోల్కొండ కోట బస్టాప్‌ వద్ద, సి– కారు పాస్‌ హోల్డర్లు గోల్కొండ బాయ్స్‌ గ్రౌండ్‌ ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లో పార్క్‌ చేయాలి.  
► డి– పాస్‌ హోల్డర్లు ప్రియదర్శిని స్కూల్‌ వద్ద వాహనాలను పార్క్‌ చేయాలి. ఇ– కారు పాస్‌ హోల్డర్లు సెవన్‌ టూంబ్స్‌ బంజారా దర్వాజ మీదుగా రేతిగల్లిలోని ఒౖవైసి గ్రౌండ్‌లో వాహనాలను పార్క్‌ చేయాలి.  

► లంగర్‌హౌస్‌ మీదుగా వచ్చే ఇ– పాస్‌ హోల్డర్లు బడాబజార్, బల్దియా ఐలాండ్‌ మీదుగా ఒవైసి గ్రౌండ్‌కు వెళ్లాలి. ఎఫ్‌– కారు పార్క్‌ హోల్డర్లు లంగర్‌హౌస్‌ మీదుగా ఫతే దర్వాజ నుంచి హుడా పార్కు వద్ద  వాహనాలను పార్క్‌ చేయాలి.  
► షేక్‌పేట్, టోలిచౌకికి చెందిన వారు బంజారా దర్వాజ నుంచి ఆర్టీసి బస్సుల ద్వారా కోటకు చేరుకోవాలి.  
► వేడుకలు పూర్తయిన తర్వాత ఏ,బీ,సీ– కారు పాస్‌ హోల్డర్లు మక్కై దర్వాజ, రాందేవ్‌గూడ, లంగర్‌హౌస్‌ నుంచి వెళ్లాలి. డి కారు పాస్‌ హోల్డర్లు బంజారదర్వాజ మీదుగా సెవన్‌ టూంబ్స్‌ వైపు వెళ్లాలి. ఇ– కారు పాస్‌ హోల్డరు బడాబజార్, ఫతే దర్వాజ గుండా వెళ్లాలి. ఎఫ్‌– కారు పాస్‌ హోల్డర్లు తమ తమ పార్కింగ్‌ ప్రదేశాల నుంచి వచ్చిన మార్గం గుండానే వెనక్కి వెళ్లిపోవాలి. అన్ని రకాల పాస్‌ హోల్డర్లు తమ పాస్‌ను తమ కారుపై డిస్‌ప్లే చేయాలి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement