Corona Vaccine:స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్‌ లేకున్నా కోవిన్‌ యాప్‌లో రిజిస్ట్రేషన్‌

Toll Free Number For Corona Vaccine - Sakshi

ఏర్పాటు చేసిన హెచ్‌పీ ఇండియా, జేబీఎఫ్‌

టీకా కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌    

సాక్షి, హైదరాబాద్‌: 18004194961. ఇది కోవిడ్‌–19 టీకా కోసం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్‌. స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్‌ సౌకర్యాలు లేకున్నా ఈ నంబర్‌ ద్వారా టీకా కోసం కో–విన్‌ అప్లికేషన్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు. ప్రముఖ ఐటీ కంపెనీ హెచ్‌పీ ఇండియా, జుబిలియంట్‌ భార తీయ ఫౌండేషన్‌ (జేబీఎఫ్‌)లు సంయుక్తంగా ఒక టోల్‌ ఫ్రీ నంబరును ఏర్పాటు చేశాయి. దేశంలోని ఏ మూల నుంచైనా 18004194961 నంబర్‌కు ఫోన్‌ చేయవచ్చు. టీకా వేయించుకో వాలను కునేవారికి అవసరమైన సమాచారం అందించేందుకు ఈ నంబర్‌తోనే ఓ వర్చు వల్‌ హెల్ప్‌డెస్క్‌ కూడా పనిచేస్తుంది. వినియోగదారులు తమ మాతృభాషలోనే సమాచారం వినే సౌకర్యం కూడా కల్పించారు. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లిషు, కన్నడ భాషల్లో ఈ వర్చువల్‌ డెస్క్‌ సహాయం అందుతుంది. మరిన్ని భాషలను జోడించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ప్రస్తుతం 18 ఏళ్ల పైబడ్డ వారందరూ టీకాలు వేయించుకునే అవకాశం ఉంది. అయితే ఇందు కోసం కో–విన్‌ యాప్‌లో వివరాలు నమోదు చేసు కోవడం తప్పనిసరి. స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్‌ సౌకర్యాలు ఉన్నవారు మాత్రమే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే వీలుంది. ఈ సౌకర్యాలు లేనివారికి యాప్‌లో నమోదు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. టీకా కేంద్రాలకు వెళ్లి పేర్లు నమోదు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఇది కొంత ప్రయాసతో కూడుకున్న వ్యవహారంగా మారింది. ఈ నేపథ్యంలో హెచ్‌పీ ఇండియా, జేబీఎఫ్‌లు ఈ టోల్‌ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తేవడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

తమ వంతు సాయంగా...
కరోనా కష్టకాలంలో తమవంతు సామాజిక సేవ చేసే లక్ష్యంతోనే ఈ టోల్‌ ఫ్రీ నంబరు, వర్చువల్‌ డెస్క్‌లను ఏర్పాటు చేసినట్లు హెచ్‌పీ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ కేతన్‌ పటేల్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలో టీకా కార్యక్రమం వేగం పుంజుకునేందుకు ఈ టోల్‌ ఫ్రీ నంబరు ఉపయోగపడుతుందని జేబీఎఫ్‌ డైరెక్టర్‌ రాజేశ్‌ శ్రీవాస్తవ అన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top