బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మళ్లీ బెదిరింపు కాల్స్‌ | Sakshi
Sakshi News home page

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మళ్లీ బెదిరింపు కాల్స్‌

Published Wed, May 29 2024 4:05 PM

Threatening Calls To Bjp Mla Raja Singh Again

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మళ్లీ బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. చంపుతామని బెదిరిస్తూ పదేపదే కాల్స్‌ చేస్తున్నారని రాజాసింగ్‌ తెలిపారు. పలు నంబర్ల నుంచి ఫోన్లు వస్తున్నాయని.. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు లేవని ఆయన మండిపడ్డారు.

తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ నంబర్లను కాల్ లిస్ట్ స్క్రీన్ షాట్‌ను రాజాసింగ్‌ తన ఎక్స్‌(ట్విట్టర్‌)లో పోస్ట్ చేశారు. ఈ కాల్స్ తనకు కొత్తేమీ కాదని.. వీటిపై గతంలో ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. అయినా ఒక బాధ్యత గల పౌరుడుగా పోలీసుల దృష్టికి తీసుకెళ్తున్నట్లు ఎక్స్‌లో పేర్కొన్నారు.

మరోవైపు, బెదిరింపు కాల్స్ చేసిన వారికి రాజాసింగ్ ట్విస్ట్ ఇచ్చారు. తనకు ఎన్ని నంబర్లు ఉన్నాయని బెదిరింపు కాల్స్ చేసిన వారు అడిగారు. ఇంకో నంబర్ ఉందని చెప్పి సీఎం రేవంత్ నంబర్ ఇచ్చాని తెలిపారు. ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పినా పోలీసులు పట్టించుకోవడంలేదు. అందుకే ముఖ్యమంత్రి నంబర్ ఇచ్చాను. ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారా? లేదా?. విచారణ ముందుకు సాగుతుందా? లేదా?’’ అంటూ ప్రశ్నించారు.

ఇవాళ నాకు కంటిన్యూయస్‌గా బెదిరింపు కాల్స్ వచ్చాయి. పాలస్తీనాకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. ధర్మం కోసం నువ్వు పనిచేస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారు. నా ఫ్యామిలీని కూడా చంపేస్తామని బెదిరించారన్నారు.

రాజసింగ్‌కు బెదిరింపు కాల్స్

కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటివి ఎన్నో కాల్స్ వచ్చాయి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇప్పుడు సీఎంగా రేవంత్ ఉన్నాడు.. ఇప్పుడైనా వీటిపై చర్యలు తీసుకుంటారో లేదో అని సీఎం నంబర్ ఇచ్చాను. ఒక ఎమ్మెల్యేకు బెదిరింపు కాల్ వస్తే ఎలాగూ పట్టించుకోలేదు. అందుకే ముఖ్యమంత్రి నంబర్ కు బెదిరింపు కాల్ వస్తే అయినా చర్యలు తీసుకుంటారా? లేదా?. విచారణ సాగుతుందా? లేదా? అనేది చూద్దాం.. నాకు ఈ కాల్స్ రావడం ఎప్పుడు బంద్ అవుతాయో చూద్దాం’’ అంటూ రాజాసింగ్‌ వ్యాఖ్యానించారు.

 

 

 

 

 

Advertisement
 
Advertisement
 
Advertisement