బీజేపీలోకి టీఆర్‌ఎస్‌ నేత భిక్షమయ్య గౌడ్‌  | Telangana: TRS Leader Bikshamaiah Goud Joins BJP | Sakshi
Sakshi News home page

బీజేపీలోకి టీఆర్‌ఎస్‌ నేత భిక్షమయ్య గౌడ్‌ 

Apr 5 2022 4:28 AM | Updated on Apr 5 2022 8:57 AM

Telangana: TRS Leader Bikshamaiah Goud Joins BJP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ నేత, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌ బీజేపీలో చేరుతున్నారు. మంగళవారం ఉదయం ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌ఛుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతల సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

తరుణ్‌ఛుగ్‌ నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భిక్షమయ్యగౌడ్‌కు కాషాయకండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఆలేరు ప్రజలకు సేవచేసేందుకే బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు భిక్షమయ్య పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల కష్టాలు తీర్చేందుకు తాను 2018లో టీఆర్‌ఎస్‌లో చేరినా అభివృద్ధిలో తనను భాగస్వామిని చేయలేదని, ప్రజల నుంచి తనను వేరు చేసే కుట్ర చేశారని ఒక లేఖ విడుదల చేశారు.   

Advertisement
 
Advertisement
Advertisement