
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) జూన్ సెషన్ ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం ఉదయం ఎడ్యుకేషన్ సెక్రటరీ యోగితా రాణా ఫలితాలను విడుదల చేశారు. మొత్తం అభ్యర్థుల్లో 33.98 శాతం అర్హత సాధించారు.
ఒక్క క్లిక్ ఫలితాల కోసం👉 https://education.sakshi.com/ లేదంటే అధికారిక వెబ్‌సైట్ https://tgtet.aptonline.in/tgtet/ క్లిక్ చేయండి
జూన్ 18 నుంచి 30వ తేదీ మధ్య జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష ప్రాథమిక ఫలితాలు విడుదల జులై 5న విడుదలైన సంగతి తెలిసిందే. పేపర్ 1కు 63,261మంది, పేపర్-2కు 1,20,392మంది దరఖాస్తు చేసుకోగా.. రెండు పేపర్లకు దరఖాస్తు చేసినవారు 15వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. పేపర్ 1 పరీక్షకు 74.65% హాజరుకాగా, పేపర్ 2 (గణితం, సైన్స్) పరీక్షకు 73.48% మంది, పేపర్ 2 (సామాజిక అధ్యయనాలు) పరీక్షకు 76.73% మంది హాజరయ్యారు.