Dussehra Special Trains: దసరాకు ప్రత్యేక రైళ్లు

సాక్షి, హైదరాబాద్: దసరా సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటిల్లో విశాఖపట్టణం–సికింద్రాబాద్ (08579/08580) ప్రత్యేక రైలు ఈ నెల 13, 20, 27 తేదీల్లో సాయంత్రం 7 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో 14, 21, 28 తేదీల్లో సాయంత్రం 7.40కి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.40కి విశాఖ చేరుకుంటుంది. అలాగే విశాఖ–సికింద్రాబాద్ మధ్య మరో రైలు (08585/08586) ఈ నెల 19, 26 తేదీల్లో సాయంత్రం 5.35కు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.10కి సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 20, 27 తేదీల్లో రాత్రి 9.05 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.50కి విశాఖ చేరుకుంటుంది.