మందుబాబులకు తెలంగాణ సర్కార్‌ షాక్‌? | Sakshi
Sakshi News home page

మందుబాబులకు తెలంగాణ సర్కార్‌ షాక్‌?

Published Tue, Dec 12 2023 8:58 PM

Telangana Revanth Reddy Govt May Give Shock To Liquor Consumers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మందు బాబులకు షాక్‌ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోందా?. గత ప్రభుత్వాల నిర్ణయాలపై వరుస సమీక్షలతో గడుపుతున్న సీఎం రేవంత్‌రెడ్డి ఈ దిశగా అధికార యంత్రాంగంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఈ క్రమంలో..

తెలంగాణ వ్యాప్తంగా బెల్ట్‌ షాపుల మూసివేతకు తెలంగాణ సర్కార్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. అలాగే.. వైన్‌ షాపుల లిక్కర్‌ సేలింగ్‌ సమయాన్ని సైతం కుదించే దిశగా సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తెలంగాణ వ్యాప్తంగా 2,620 బెల్ట్‌ షాపులు ఉన్నాయి. 

మరోవైపు మద్యం రేట్ల విషయంలోనూ విధివిధానాల రూపకల్పన కోసం.. ఒక పాలసీ ఏర్పాటు యోచనలోనూ రేవంత్‌ సర్కార్‌ ఉన్నట్లు సమాచారం.  మరో రెండు, మూడు రోజుల్లో ఈ అంశంపై ఒక స్పష్టమైన ప్రకటన వెలువడొచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటికప్పుడు అది అమలు కాకపోవచ్చనే అభిప్రాయమూ వ్యక్తం చేస్తున్నారు కొందరు అధికారులు.

 

Advertisement
 
Advertisement
 
Advertisement