Covid -19 Update: TS Records 148 New Corona Positive Cases - Sakshi
Sakshi News home page

Telangana: కొత్తగా 148 కరోనా పాజిటివ్‌ కేసులు

Nov 16 2021 4:52 AM | Updated on Nov 16 2021 12:14 PM

Telangana Records 148 New Covid 19 Cases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో సోమవారం నిర్వహించిన 34,778 కరోనా నిర్ధారణ పరీక్షల్లో 148 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,73,722కు చేరింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు కరోనా బులెటిన్‌ విడుదల చేశారు.

రాష్ట్రంలో ఒకరోజు కరోనాతో ఇద్దరు చనిపోగా, ఇప్పటివరకు 3,975 మంది మృతిచెందారని చెప్పారు. ఒకరోజు వ్యవధిలో కరోనా నుంచి 151 మంది కోలుకోగా, ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 6,66,012కు చేరిందని తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement