భౌగోళికంగా విడిపోయినా మనసులు కలిసే ఉన్నాయి | Sakshi
Sakshi News home page

భౌగోళికంగా విడిపోయినా మనసులు కలిసే ఉన్నాయి

Published Sat, Jan 14 2023 1:09 AM

Telangana: Minister Srinivas Goud Meet Amaravati Trade Unions Leaders - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ భౌగో ళికంగా విడిపోయినప్ప టికీ మన మనసులు కలిసే ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, పర్యా టక, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొ న్నారు. తెలుగు ప్రజలకు మంత్రి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని కుటుంబ సమేతంగా వెళ్లి శ్రీనివాస్‌గౌడ్‌ దర్శించుకున్నారు. అనంతరం రెవెన్యూ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీలోని జేఏసీ, అమరావతి ఉద్యోగుల సంఘాల నాయకులు బొప్పరాజు, వైవీ రావు తదితరులు మంత్రిని ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ... ఉమ్మడి రాష్ట్రంలో చిరకాల మిత్రుడు బొప్పరాజుతో కలసి కొన్ని దశాబ్దాలు ఉద్యోగ సమస్యలపై కలసి పనిచేశామని గుర్తు చేశారు. ప్రభు త్వంతో ఘర్షణ వైఖరి లేకుండా సమస్యలను ప్రభుత్వ పెద్దల దృష్టికి, ఉన్నతాధి కారుల దృష్టికి తీసుకొని వెళుతూ పరిష్కారానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలనే సంకల్పం విజయ వంతం కావాలని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు భగవంతుడు మరింత శక్తినివ్వాలని అమ్మవారిని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement