కేంద్ర బడ్జెట్‌లో బీసీలకు లక్షకోట్లు కేటాయించాలి 

Telangana: Krishnaiah Demand To Allocate Lakhs Of Crores To BCs - Sakshi

అఖిలపక్ష సమావేశంలో ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ 

కాచిగూడ (హైదరాబాద్‌): కేంద్రప్రభుత్వం వచ్చే బడ్జెట్‌లో బీసీల సంక్షేమం, అభివృద్ధికి రూ.లక్ష కోట్లు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ అధ్యక్షతన శనివారం కాచిగూడలోని అభినందన్‌ గ్రాండ్‌లో అఖిలపక్ష పార్టీల, బీసీ సంఘాల సమావేశం జరిగింది. సమావేశంలో వి.హనుమంతరావు (కాంగ్రెస్‌), అజీజ్‌పాషా (సీపీఐ), ఎస్‌.వీరయ్య (సీపీఎం), ఇందిరా శోభన్‌ (ఆమ్‌ఆద్మీ), ఎ.సుద ర్శన్‌ (శివసేన), రవీందర్‌ (ఎన్‌సీపీ), జ్యోతి (శివసేన), లాల్‌ కృష్ణ, కోల జనార్ధన్‌ (బీసీ సంక్షేమ సంఘం)లతో పాటు 56 కులసంఘాలు, 36 బీసీ సంఘాలు, 26 బీసీ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

కేంద్రప్రభుత్వం బీసీల ఆర్థికాభి వృద్ధికి ఎలాంటి పథకాలు పెట్టడం లేదని, రాయితీ లు కల్పించడం లేదని, బడ్జెట్‌ కేటాయింపులు చేయడం లేదని ఆరోపించారు. రాజ్యాంగబద్ధంగా నియమించిన మండల్‌ కమిషన్‌ 40 సిఫార్సులు చేయగా.. కేవలం విద్య, ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లు మాత్రమే అమలు చేశారని, మిగతా ఆర్థికపరమైన ఒక్క స్కీమ్‌ కూడా అమలు చేయడానికి బడ్జెట్‌ కేటాయించడం లేదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ మాదిరిగా బీసీలకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బీసీ యాక్ట్‌ ను తీసుకురావాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమం లో నీల వెంకటేశ్, కోట్ల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top