తెలంగాణ: ఈ-పాస్ కోసం ధరఖాస్తు చేసుకోవడం ఎలా?

Telangana: how to apply for e pass during lockdown - Sakshi

హైదరాబాద్: తెలంగాణలో పదిరోజుల పాటు కఠిన లాక్‌డౌన్‌ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ లాక్‌డౌన్‌ కాలంలో వేరే రాష్ట్రాలకూ, ఇతర జిల్లాలకు వెళ్లే వారికి ఈ-పాస్ విధానం ద్వారా ప్రత్యేక పాసులు అందజేస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో అందచేసే ఈ- పాస్ లకు కోసం https://policeportal.tspolice.gov.in/ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితులకు గాను లాక్‌డౌన్‌ సడలించిన సమయంలో కాకుండా ఇతర సమయాల్లో ప్రయాణించే వారికి మాత్రమే పాసులను జారీ చేస్తామని తెలిపారు. 

ఇతర రాష్ట్రలకూ, రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు వెళ్లే వారికి సంబంధిత పోలీస్ కమీషనర్లు, ఎస్పీలు మాత్రమే పాస్‌లను జారీ చేయనునట్లు తెలిపారు. అయితే, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే వారికి మాత్రం సంబంధిత రాష్ట్రాల నుంచే పాస్‌లు జారీ చేస్తాయని అన్నారు. హైదరాబాద్ లో ఒక కమిషనరేట్ నుంచి మరో కమిషనరేట్ పరిధికి ప్రయాణించే వారికి ప్రయాణం ప్రారంభమయ్యే పరిధిలోని కమిషనరేట్ నుంచే పాసులు జారీ చేస్తారని వివరించారు. లాక్‌డౌన్‌ సడలింపు సమయమైన ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపు ప్రయాణించే వారికి ఏవిధమైన పాసులు అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే మిగతా సమయంలో ప్రయాణించే వారు మాత్రం వెబ్‌సైట్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ-పాస్ ధరఖాస్తు విధానం: 

► మొదట ఈ-పాస్ వెబ్‌సైట్(https://policeportal.tspolice.gov.in/) ఓపెన్ చేసి ఈ-పాస్ మీద క్లిక్ చేయండి. 

► మీరు ప్రస్తుతం నివసిస్తున్న జిల్లా/కమిషనరేట్‌ను ఎంపిక చేసుకోవాలి


► ఆ తర్వాత మీ పేరు, ఆధార్ నెంబర్, వాహనం, ఎంతమంది, పాస్ ఎందుకు, దేని కోసం, ఫోన్ నెంబర్లు, మీరు వెళ్లాల్సిన పోలీస్ స్టేషన్ పరిధి, డిస్టెన్స్, తదితర వివరాలతోపాటు.. ఫొటో, పర్పస్ డాక్యుమెంట్, కేవైసీ ఫాంలను అప్‌లోడ్ చేయాలి.

► ఆ తర్వాత మీకు ఒక acknowledgment number(రశీదు సంఖ్య) వస్తుంది. 

► ఇప్పుడు మీరు వెనక్కి వెళ్లి సిటిజన్ ప్రింట్ పాస్ క్లిక్ చేసి రశీదు సంఖ్య నమోదు చేయండి. 

► మీరు వెళ్లాలి అనుకున్న పరిధుల్లోని కమిషనరేట్, ఎస్పీల నుంచి ఈ పాస్ మంజూరు అవుతుంది.

► ఈ పాస్ చూపించి రాష్ట్రం పరిధిలోని జిల్లాలకు ఆంక్షల సమయంలో ప్రయాణం చేయవచ్చు.

చదవండి:

పోస్టాఫీసు ఖాతాదారులకు అలర్ట్! 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top