మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో ఊరట | Telangana High Court Stay On KCR Petition Over Rail Roko Agitation Case | Sakshi
Sakshi News home page

మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో ఊరట

Jun 25 2024 12:56 PM | Updated on Jun 25 2024 3:14 PM

Telangana High Court Stay On KCR Petition Over Rail Roco Case

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 2011లో జరిగిన రైలు రోకో కేసు వ్యవహారంలో విచారణపై హైకోర్టు స్టే విధించింది.

కాగా, 2011లో తెలంగాణ ఉద్యమం సందర్భంగా తనపై రైలు రోకో కేసులో కేసీఆర్‌ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టేయాలని పిటిషన్‌లో కోరారు. తాను రైలు రోకోలో పాల్గొనలేదని తెలిపారు. తనపై తప్పుడు కేసు నమోదు చేశారని చెప్పుకొచ్చారు. కాగా, కేసీఆర్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేసుపై స్టే విధించింది. ఇదే సమయంలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను జూలై 18వ తేదీకి వాయిదా వేసింది.

హైకోర్టులో మాజీ సీఎం సీఎం కేసీఆర్‌కు ఊరట...

 

Advertisement
 
Advertisement
Advertisement