సురేష్‌పై ఎందుకంత ప్రేమ? : హైకోర్టు | Telangana High Court Questioned KCR Govt Over Niloufer Hospital | Sakshi
Sakshi News home page

సురేష్‌పై ఎందుకంత ప్రేమ? : హైకోర్టు

Jul 30 2020 4:19 PM | Updated on Jul 30 2020 4:31 PM

Telangana High Court Questioned KCR Govt Over Niloufer Hospital - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  నిలోఫర్ ఆస్పత్రిలో భోజనం సరఫరా చేసే కాంట్రాక్టర్ అక్రమాలపై విచారణ జరపాలన్న పిల్‌పై గురువారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ కమిటీ నివేదిక ఇచ్చి ఐదు నెలలైనా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని, నిలోఫర్ ఆస్పత్రిలో భోజనం సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్‌పై ఎందుకంత ప్రేమ? అని ధర్మాసనం ప్రశ్నించింది.  (చదవండి : జిల్లాకు రూ.లక్ష ఏం సరిపోతాయి?)

కాంట్రాక్టర్ సురేష్ కుమార్‌ను అందరూ వెనకేసుకొస్తున్నట్టు కనిపిస్తోందని, కమిటీల నివేదికలపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. గాంధీ, ఛాతీ ఆస్పత్రుల్లో కూడా కాంట్రాక్టర్ సురేష్‌కుమార్ పనితీరును పరిశీలించి, ఆగష్టు 17లోపు నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement